Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆమె కోసం పవన్ కల్యాణ్‌ రూ. 3 కోట్లు...?!! రామ్ చరణ్‌కు కౌంటరా...?





అత్తారింటికి దారేదితో టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినా స్టార్‌గా రికార్డు సృష్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి గబ్బర్ సింగ్ 2 కోసం హీరోయిన్ వెతుకులాటలో ఉన్నాడు. పనిలో పనిగా రామ్ చరణ్‌కు కూడా కౌంటర్ ఇవ్వనున్నాడనే వార్తలు వస్తున్నాయి. గబ్బర్ సింగ్ 2 కోసం ఆమధ్య బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ అనుష్క శర్మను కాంటాక్ట్ చేస్తే అమ్మడు ఏకంగా రూ. 3 కోట్ల పారితోషికం అడిగిందట. అంతే... ఆకాశం వైపు చూడటం పవన్ వంతయిందట.

పారితోషికం వ్యవహారమో అమ్మడి టెక్కో తెలియదు కానీ ఆ తర్వాత అనుష్క శర్మను పక్కన పెట్టేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. తాజాగా ఆమె స్థానంలో దీపికా పదుకునెను తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్ న్యూస్.

ఐతే మొన్నగాక నిన్న వచ్చిన అనుష్క శర్మ 3 కోట్లు అడిగితే తానేమైనా తక్కువ తిన్నానా... అన్నట్లు తనకూ అంతకు తగ్గకుండా ముట్టజెప్పాలని దీపికా కండిషన్ పెట్టినట్లు సమాచారం. వీళ్ల వ్యవహారం చూసిన పవర్ స్టార్, ఆ 3 కోట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. విశేషం ఏమంటే... టాలీవుడ్ హీరోయిన్లకు 80 నుంచి 90 లక్షలిస్తే సరిపోతుంది.

కానీ బాలీవుడ్ హీరోయిన్లకు అంత మొత్తం చెల్లించడం వెనుక వేరే రీజన్ ఉందంటున్నారు టాలీవుడ్ జనం. అదేంటయా అంటే పవన్ కల్యాణ్ బాలీవుడ్ ఎంట్రీకి గబ్బర్ సింగ్ 2 బాణాన్ని వదులుతున్నాడని చెపుతున్నారు. ఇది రామ్ చరణ్ కు కౌంటరా...? చూడాలి మరి.

Recent Posts