Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పాస్‌పోర్టులో తప్పులు దొర్లితే ఏం చేయాలి?





చాలా మంది తీసుకునే పాస్‌పోర్టుల్లో తప్పులు దొర్లుతుంటాయి. ఈ తప్పులు పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, ఇతరాత్రా తప్పులు ఉంటాయి. అయితే, ఒకసారి పాస్ పోర్టులో ముద్రితమైన తప్పులను సరి చేసుకోవాలంటే నానా తిప్పలు పడాల్సిందే. పైపెచ్చు.. తప్పులు దొర్లిన పాస్‌పోర్టును ఉపయోగించేందుకు వీలూ ఉండదు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలన్న అంశంపై న్యాయ నిపుణులను సంప్రదిస్తే...

సర్వసాధారణంగా పాస్‌పోర్టులో తప్పులు దొర్లవని, ఒకవేళ దొర్లినట్టయితే వాటిని వెంటనే సరి చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. పుట్టిన తేదీ లేదా పుట్టిన స్థలం తాలూకు సమాచారంలో తప్పులు దొర్లినట్టయితే పదో తరగతి సర్టిఫికెట్‌తో పాటు, ఒక అఫిడవిట్‌ నోటరీ చేయించి జతచేసి వీటికై ఉన్న ప్రత్యేకమైన అప్లికేషన్‌ సమర్పించి... మార్పు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

అదే నిరక్షరాస్యులైతే సంబంధిత గ్రామపంచాయితీ నుంచి జనన మరణాల రిజిష్టర్‌ నుంచి జనన ధృవీకరణ పత్రం తీసుకుని, సివిల్‌ కోర్టులో డిక్లరేషన్‌ సూట్‌ ఫైల్‌ చేసి, అందులో రీజనల్‌ పాస్‌పోర్టు అధికారిని ఓ పార్టీగా చేర్చాల్సి ఉంటుంది. కోర్టు, గ్రామపంచాయితీ రికార్డు ప్రకారం మీ జనన తేది, ప్రాంతం మార్చి కొత్త పాస్‌పోర్టు జారీ చేయాల్సిందిగా పాస్‌పోర్టు అధికారులను కోర్టు ఆదేశిస్తే పాస్ పోర్టులోని తప్పులను సరి చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

Recent Posts