బాబు మీద కన్నేసిన జేసీ బ్రదర్స్
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్న సంకేతాలు మరో సారి వెలువడ్డాయి. నేనయితే కాంగ్రెస్ ను వీడనని, తన కుమారుడు, తమ్ముడు ఏం చేస్తారు ? అన్నది వారి సొంత నిర్ణయం అని చెప్పుకొచ్చిన జేసీ తన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా జేసీ మాట్లాడగా ఇప్పుడు ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మాట్లాడడం వీరు టీడీపీలో చేరతారని బలం చేకూరుతోంది.
ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నేత చంద్రబాబేనని, చంద్రబాబు మీద తనకు నమ్మకం ఉందని, గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకోవాల్సిందేనని ప్రభాకర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్పు ప్రమాదం మీద విచారణను ఆయన స్వాగతించారు. జబ్బార్ ట్రావెల్స్ కు బస్సును లీజుకు ఇచ్చిన విషయం ప్రశ్నిస్తే ఆర్టీసీ లీజుకిస్తే తప్పు కానప్పుడు ..మేమిస్తే తప్పా అని ప్రశ్నించారు.
You may also Like
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼
