Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

టీడీపీ లోక్ సత్తా దోస్తీ కూడా ఖాయమే?

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్లు బీజేపీకి బాగాదగ్గరయ్యారు. స్వయంగా తెలుగుదేశం అధినేత వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోందని బాబు చెబుతున్నాడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దేశంలో బీజేపీ బంపర్ మెజారిటీ సాధిస్తాయని ఆయన అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని బాబు చెప్పడం వరకూ ఓకే గానీ బీజేపీ గెలుస్తుందని చెప్పడం మాత్రం విశేషం.
దీన్ని బట్టి బాబు బీజేపీతో దోస్తీ పట్ల ఉత్సాహం చూపుతున్నాడని అనుకోవాల్సి వస్తుంది. తాను, తను ఇష్టపడుతున్న పార్టీలు మంచి విజయం సాధించబోతున్నాయని బాబు ప్రకటించాడు అనుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయం కాగలవని బాబు అంటున్నాడు. ఈ ఉత్సాహంలో మూడో కూటమిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాబు చెబుతున్నాడు.
మరి బీజేపీ, తెలుగుదేశంలు దాదాపు ఒకటే అయ్యాయి అనుకొంటే.. వీరిద్దరికీ ఇప్పుడు మరో పార్టీ కూడా దగ్గర అయ్యేలా ఉంది. అది లోక్ సత్తా. గత ఎన్నికల ముందు ఆవిర్బవించి తొలి సారి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొన్న లోక్ సత్తాకు ఈ సారి సోలోగా ఎన్నికలకు వెళ్లే ఓపిక లేనట్టుంది. తాజాగా లోక్్ సత్తా అధినేత జేపీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణం వైఎస్సార్ అని అంటున్నాడు. ఇవి ఒక సగటు తెలుగుదేశం నేత చేసే ఆరోపణలు. మరి జేపీ కూడా ఇప్పుడు ఇవే మాటలు చెబుతున్నాడు. వీటిని బట్టి.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి లోక్ సత్తా కూడా తెలుగుదేశంతో దోస్తీకి సిద్ధం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి తెలుగుదేశానికి దోస్తులు బాగానే కలిసి వస్తున్నారనమాట!

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)