Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మగాళ్లే చాలా రొమాంటిక్!

రొమాన్స్…అంటే ఇష్టాన్ని వ్యక్తీకరించడాన్ని ఈ పేరుతో చెప్పవచ్చునేమో! ఈ ఇష్టాన్ని, ప్రేమను, సెక్సువల్ డిజైర్స్ ను వ్యక్తీకరించడంలో అవతలి వారిని బాగా ఇంప్రస్ చేయగలిగే వారిని కొన్ని కండిషన్స్ ను అప్లై చేస్తూ రొమాంటిక్ ఫెలోస్ అనొచ్చు! అయితే ముందుగా వ్యక్తి  నచ్చినప్పుడే అతడి ఎక్స్ ప్రెషన్స్ కూడా నచ్చుతాయి అనేది కండిషన్! ఇలా ప్రేమను వ్యక్తీకరించడం విషయంలో ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువగా ఎక్స్ ప్రసెసివ్ అని…దీంతో స్త్రీల కంటే పురుషులను మోర్ రొమాంటిక్ అని చెప్పవచ్చునని ఒక అధ్యయనం అభిప్రాయపడింది! అది కూడా రొమాంటిక్ స్థాయి విషయంలో పురుషులు స్త్రీల కన్నా 50 శాతం హైట్ లో ఉన్నారట! ఉదాహరణకు వేలంటైన్స్ డే సందర్భంలో తమ ప్రేమను వ్యక్తీకరించడంలో (కేవలం తొలిసారి ఐలవ్యూ చెప్పే వారే కాక, దంపతుల, ప్రేమికుల విషయంలో కూడా) మగవాళ్లు చాలా ఉత్సాహాన్ని చూపుతున్నారు! కేవలం ప్రేమికుల రోజునే కాదు… ఏ సమయంలోనైనా మగవాళ్లు తమ ప్రేమవిషయంలో చాలా ఎక్స్ ప్రెసివ్. తాము ఎలాంటి సందర్భంలోనూ ప్రేమను వస్తువులతోనూ, ఇతర సర్ ప్రైజులతోనూ తమ భాగస్వామికి పంచడం లేదని దాదాపు 21.5 శాతం మంది తేల్చేశారు! విదేశాల్లోనే ఇలాంటి పరిస్తితి ఉందంటే… ఇక అనేక కట్టుబాట్లు ఉన్న మనదేశాల్లో మహిళలు తమ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడంలో ఎంత వెనుకబడి ఉంటారో ఊహించవచ్చు! అయితే పురుషుల విషయంలో కేవలం 14.5 శాతం మంది తాము ప్రేమను వ్యక్తీకరించడానికి అంత ప్రాధాన్యం ఇవ్వమని చెప్పారు. ఓవరాల్ గా 35 శాత మంది జనులు వైవాహిక, వ్యక్తిగత ప్రేమలను చెప్పుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. చక్కటి పదాలతోనో, పూలతోనో, ఇంకేమైనా సర్ ప్రైజ్ లతోనో ఫ్రేమను పంచుకోని వారు చాలా మంది వారు ఉన్నారు. వారిలో మహిళల శాతం ఎక్కువ, పురుషుల్లో కూడా చాలా మంది ఆడదాన్ని అలరించేలా కొంచెం ప్రేమను వ్యక్తీకరించని వారున్నారు అని ఈ అధ్యయనం తెలిపింది.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)