Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

రెచ్చిన షమీ: సచిన్ ఫ్యాన్స్‌కు నిరాశ, భారత్ గెలుపు



    కోల్‌కతా: వెస్టిండీస్ క్రీడాకారులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులను నిరాశపరిచారు. భారత్ రెండో ఇన్నింగ్సు ఆడాల్సిన అవసరం రాకుండా ఆటను ముగించేశారు. దీంతో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ను అభిమానులు మిస్సయ్యారు. రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. దీంతో భారత్ తొలి టెస్టు మ్యాచును ఇన్నింగ్సు 51 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఐదు రోజుల టెస్టు మ్యాచు మూడు రోజుల్లోనే ముగిసింది




          వెస్టిండీస్ తొలి ఇన్నింగ్సులో 234 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 168 పరుగులు చేసింది. భారత్ రోహిత్ శర్మ, అశ్విన్ అద్భుతమైన సెంచరీలతో తొలి ఇన్నింగ్సులో 453 పరుగులు చేసింది. అంతకు ముందు - భారత్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో వెస్టిండీస్ ఆదిలోనే క్రిస్ గేల్ వికెట్‌ను కోల్పోయింది. మరోసారి క్రిస్ గేల్ భువనేశ్వర్ కుమార్‌కు దొరికిపోయాడు. అతను 33 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో వెస్టిండీస్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్సులోనూ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 120 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బ్రేవో అశ్విన్ బౌలింగులో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. పావెల్ 36 పరుగులు చేసి అశ్విన్ బౌలింగులో శామ్యూల్స్ నాలుగు పరుగులు చేసి షమీ బౌలింగులో అవుటయ్యారు. షమీ మరోసారి విజృంభిస్తున్నాడు. అతను రామ్‌దిన్ వికెట్ తీయడంతో వెస్టిండీస్ 125 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అతను కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. షమీ మరో వికెట్ తీశాడు. డారెన్ సామీ షమీ బౌలింగులో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో వెస్టిండీస్ 152 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ 152 పరుగుల వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. సామీ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన షిల్లింగ్‌ఫోర్డు షమీ బౌలింగులో పరుగులేమీ చేయకుండా అవుట్ కాగా, ఆ వెంటనే పెర్మాల్ సున్నా పరుగులకే రన్నవుట్ అయ్యాడు. వెస్టిండీస్ 159 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 

           వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌పై భారత 129 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను సాధించింది. శుక్రవారం రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ తమ ఆటను ప్రారంభించిన తర్వాత 453 పరుగుల వద్ద భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొహమ్మద్ షమీ అవుట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్సుకు తెరపడింది. వెస్టిండీస్ బౌలర్లలో షేన్ షిల్లింగ్‌పోర్డు ఆరు వికెట్లు తీసుకోగా, పెర్మాల్ రెండు, బెస్ట్, కొట్రెల్ తలో వికెట్ తీసుకున్నారు. శుక్రవారం మూడో రోజు రోహిత్ శర్మ 177 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. పెర్మాల్ బౌలింగులో అతను పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో భారత్ 436 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 354 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రోహిత్ శర్మ, అశ్విన్ శుక్రవారం బ్యాటింగ్‌కు దిగారు. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో శుక్రవారం నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. రవిచంద్రన్ అశ్విన్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. కాగా, అశ్విన్ 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగులో వెనుదిరిగాడు. దీంతో భారత్ 444 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. షిల్లింగ్‌ఫోర్డు బౌలింగులో భువనేశ్వర్ కుమార్ అవుట్ కావడంతో భారత్ 451 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

.


Recent Posts