Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

భారత్‌కు గూగుల్ కొత్త ట్యాబ్లెట్ వచ్చేస్తోంది!!!

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్, తన రెండవ తరం పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ‘నెక్సూస్ 7' (సెకండ జనరేషన్) ట్యాబ్లెట్‌ను ఈ నవంబర్ 12న ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే నెలలో గూగుల్ తన నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గూగల్ తన నెక్సూస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల కాలంలో యూఎస్ మార్కెట్లలో విడుదల చేసింది. గూగుల్ మైక్రో‌సైట్ గూగుల్ నెక్సూస్ 7 (సెకండ్ జనరేషన్) ఇండియన్ మార్కెట్ ధరను రూ.25,999గా ప్రచురించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో నెక్సూస్5 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్ ధరను రూ.28,999గా పోస్ట్ చేయటం జరిగింది. నెక్సూస్ 7 (సెకండ్ జనరేషన్) ట్యాబ్లెట్ వై-ఫై ఇంకా 3జీ/ఎల్టీఈ వేరియంట్‌లలో లభ్యంకానుంది. నెక్సూస్ 5 స్మార్ట్ ఫోన్ 16జీబి ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. గూగుల్ రెండవ తరం నెక్సూస్ 7 ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1200పిక్సల్స్), 323 పిక్సల్ పర్ ఇంచ్, స్ర్కాచ్ రెసిస్టెంట్ కార్నింగ్ గ్లాస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ 16జీబి, 32జీబి, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.3 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3950ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, వై-ఫై ఇంకా 3 ఎల్టీఈ వేరియంట్స్.

Recent Posts