Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

రెండో రోజు: రో'హిట్', సెంచరీకి చేరువలో అశ్విన్..

కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచు తొలి ఇన్నింగ్సులో రెండో రోజు గురువారం భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆరంగేట్రంతోనే అదరగొట్టాడు. తన తొలి టెస్టు మ్యాచులోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. అశ్విన్‌తో కలిసి నిలకడగా ఆడుతూ భారత్ పరువు నిలబెట్టాడు. తొలి టెస్టులోనే సెంచరీ చేసిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. భారత్, వెస్టిండీస్ తొలి టెస్టు స్కోరు కార్డు టాప్ ఆర్డర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డు ధాటికి కుప్పకూలిన నేపథ్యంలో రోహిత్ శర్మ గోడలా నిలబడ్డాడు. ధోనీ అర్థ సెంచరీ, రోహిత్ సెంచరీ, అశ్విన్ అర్థ సెంచరీలతో భారత్ గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుపై 120 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ 127 పరుగులతో, అశ్విన్ 92 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో షిల్లింగ్‌ఫోర్డు నాలుగు వికెట్లు తీయగా, బెస్ట్, కోట్రెల్ తలో వికెట్ తీశారు. నిజానికి మొదట్లో వెస్టిండీస్ బౌలర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డు భారత బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెట్టించాడు. భారత తొలి ఇన్నింగ్సులో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ మూడు పరుగులు మాత్రమే చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.

వెస్టిండీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి నింపాదిగా ఆడుతూ వచ్చిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెస్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో భారత్ 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటి నుంచి వికెట్ పడకుండా రోహిత్ శర్మ, అశ్విన్ ఇన్నింగ్సును కొనసాగించారు. అంతకు ముందు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 199వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో గురువారం ఈడెన్ గార్డెన్ ప్రేక్షకులను నిరాశపరిచారు. కేవలం పది పరుగులు మాత్రమే చేసి షిల్లింగ్‌ఫోర్డుకు దొరికిపోయాడు. అంతకు ముందే ఛతేశ్వర్ పుజారా పెవిలియన్ దారి పట్టాడు. షిల్లింగ్ ఫోర్డు మూడు వికెట్లు పడగొట్టాడు. గురువారం రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. భారత్ 52 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ దావన్ 23 పరుగులు, మురళీ విజయ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు. రెండు వికెట్లు కూడా షిల్లింగ్‌ఫోర్డుకు లభించాయి. సచిన్ టెండూల్కర్, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు
.


Recent Posts