Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కోల్‌కతా టెస్ట్ : రోహిత్ టెస్ట్ అరంగేట్రం - విండీస్ బ్యాటింగ్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పర్యాటక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ ఓపెనర్లుగా గేల్, పౌవెల్‌లు క్రీజ్‌లోకి వచ్చారు.

ఇదిలావుండగా, ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత్ క్రికెట్ జట్టు తరపున వన్డే జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలరర్ మహమ్మద్ షమీలు టెస్ట్ అరంగేట్రం చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు 199వ టెస్ట్ మ్యాచ్. ముంబైలో జరిగే టెస్ట్ మ్యాచ్‌తో తన క్రికెట్ కెరీర్‌కు సచిన్ స్వస్తి చెప్పనున్నాడు.

భారత జట్టు : ధవాన్, మురళీ విజయ్, పుజారా, టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, ధోనీ, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, ఓఝా.

వెస్టిండీస్ జట్టు : గేల్, పౌవెల్, బ్రావో, శ్యామ్యూల్స్, చందర్‌పాల్, రాందిన్, సమ్మీ, షిల్లింగ్‌ఫోర్డ్, పెర్మ్యూల్, కాట్టరెల్, బెస్ట్.

Recent Posts