Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో నారా భువనేశ్వరి

దేశంలో వాణిజ్య రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో... తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ నారా భువనేశ్వరికి చోటు లభించింది. 50 మంది మహిళలతో ఫార్చ్యూన్ పత్రిక విడుదల చేసిన జాబితాలో భువనేశ్వరి తొలిసారి స్థానం సంపాదించారు. పలు కంపెనీల బోర్డు డైరెక్టరుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భువనేశ్వరి హెరిటేజ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 2012-13లో హెరిటేజ్ ఫుడ్స్ రూ.1606 కోట్ల వార్షిక టర్నోవరు సాధించింది.

ఈ లిస్టులో, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచ్చర్ వరుసగా మూడో ఏడాది అగ్రపీఠాన్ని అధిష్ఠించారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ, క్యాప్ జెమినీ సీఈవో అరుణ జయంతిలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది నారా భవనేశ్వరి సహా కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది.

Recent Posts