Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పవన్ కల్యాణ్‌ను రామోజీరావు ఎందుకు కలిశారు?



పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. 'అత్తారింటికి దారేది' థ్యాంక్యూ మీట్‌లో ఆయన ఇచ్చిన స్పీచ్ గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఈ థ్యాంక్యూ మీట్‌లో పవన్ అత్తారింటికి దారేది సినిమా పైరసీపై తీవ్రంగా స్పందించాడు. పైరసీకి పాల్పడిన వాళ్ల వెనుక ఎంతటి వారున్నా తాట తీస్తా అని పవన్ హెచ్చిరికలు జారీచేశాడు.



ఈ థ్యాంక్యూ మీట్‌లో పవన్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. పవన్ ఏ ఫంక్షన్‌లోనూ, మీటింగ్‌లోనూ ఇంతసేపు మాట్లాడలేదు. ఎప్పుడూ లేనిదీ... పవన్‌ కళ్యాణ్ దాదాపు 38 నిముషాలు మాట్లాడటం హైలైట్‌గా నిలిచింది. పవన్‌ మాట్లాడే తీరు.. ఆచితూచి.. ఆగుతూ ఆగుతూ ఆలోచిస్తూ మాట్లాడుతుంటాడు. రియల్‌ వక్తకాదుఏదిఏమైనా చిరంజీవి చెప్పేది స్పష్టంగా ఉంటుంది. చేసేది ఎలా ఉంటుందో తెలిసిందే. అలాగే ఎన్‌టిఆర్‌ స్పీచ్‌ కూడా స్పష్టంగా ఉంటుంది. రాజకీయ నాయకులుగా అవ్వాల్సినవారు ఎదుటివారిని ఆకట్టుకునేట్లుగా మాట్లాడాలి. అతను ఎలాంటివాడైనా మాటల్తో బురిడీ కొట్టించాలి. పవన్‌ కళ్యాణ్ అదే చేయబోయాడు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బహుశా 2014లో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లుందని ఇప్పుడు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనికి మరింత బలం చేకూర్చే మరో వార్త ఇప్పుడు మీడియాలో ప్రచారంలో ఉంది. రాష్ట్ర రాజకీయాలలో కింగ్ మేకర్‌గా, మీడియా ప్రపంచానికి చక్రవర్తిలా పిలిపించుకొనే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పవన్‌ను రెండుసార్లు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతరాజకీయాలపై వీరిద్దరూ చాలా సుదీర్ఘంగా చర్చించుకున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా యూత్‌లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న పవన్ అలాగే తెలుగు మీడియా ప్రపంచంలో చక్రవర్తిలా వెలిగిపోతున్న రామోజీ కలవడం వెనుక ఎదో ఒక రాజకీయ ఉద్దేశ్యం ఉందంటూ వార్తలు వస్తున్నాయిఒకప్పుడు నందమూరి తారక రామారావుకు ఆ తరువాత చంద్రబాబునాయుడుకు గుండెకాయలా వ్యవహరించిన రామోజీరావు పవన్‌ను కలవడం వెనుక ఆంతర్యం తెలుగుదేశం పార్టీ వైపు పవన్‌ను మలచుకోవడానికా లేదంటే మరేదైనా రాజకీయ ఉద్దేశ్యం వీరిద్దరి మధ్యా ఉన్నదా? అనే విషయంపై ఎవరికి తోచిన అభిప్రాయలు వారు వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనా త్వరలో పవన్ కళ్యాణ్ నుండి ఒక సంచలన వార్త వచ్చే విధంగా ఆయన మాటలు అర్ధాలు ఇస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు

Recent Posts