Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

'రామయ్య'ను ముంచేసిన హరీష్ శంకర్ ట్విట్టర్ పిచ్చి...








హరీష్ శంకర్ ఒకప్పుడు ఎవరికీ తెలీదు. 'గబ్బర్ సింగ్' సినిమా హిట్‌తో రాత్రికి రాత్రే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అయిపోయాడు. టాలీవుడ్ డైరెక్టర్‌లలో ఎవరూ మెయింటైన్ చేయనివిధంగా ట్విట్టర్‌ను ఫాలో అవుతుంటాడు. ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో తన కొత్త సినిమాల గురించి పోస్ట్ చేస్తూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.




'గబ్బర్ సింగ్' సినిమా హిట్‌తో ఈయనకు చాలామంది అభిమానులు అయిపోయారు. తాను కాలేజీ రోజుల నుంచే పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పుకోవడంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సోషల్ నెట్వర్కింగులో విరివిగా ఫాలో కావడం మొదలుపెట్టారు. 'గబ్బర్ సింగ్' సినిమా టైంలో పవన్ కల్యాణ్ గ్రేట్ ఆయన మా అందరికీ ఆదర్శం అంటూ ట్విట్టర్‌లో పవన్ భజన చేసేవాడు.




'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత హరీష్ శంకర్ 'రామయ్యా వస్తావయ్యా' ప్రాజెక్టును ఒప్పుకున్నాడు అప్పటి నుండీ పవన్‌ను మర్చిపోయి ఎన్టీఆర్ భజన చేయడం మొదలుపెట్టాడు. దీంతో పవన్ అభిమానులు హరీష్ శంకర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే భజన పార్టీ అని అర్థం చేసుకున్నారు. హరీష్ శంకర్ ట్విట్టర్ పేజీలో అతిగా చేసే ట్వీట్లు చూసి పలువురు చిరాకుపడ్డ సందర్భాలూ ఉన్నాయి.




తాజాగా వచ్చిన ఎన్టీఆర్‌తో చేసిన 'రామయ్యా వస్తావయ్యా' నిరాశపరచడంతో మనోడిని ట్విట్టర్‌లో ఏకిపారేస్తున్నారు. ఒక అభిమాని హరీష్‌పై ఈ విధంగా ట్విట్ చేశాడు....'మీరు అతిగా ట్వీట్లు చేసి సినిమాపై అంచనాలు భారీగా పెంచారు. మీరు ట్వీట్స్ పై పెట్టిన శ్రద్ధ కాస్త సెకండాఫ్‌లో పెట్టి ఉంటే సినిమా బాగుండేది' అంటూ వెటకారంగా వ్యాఖ్యానించాడు.




దీంతో చిర్రెత్తుకొచ్చిన హరీష్ 'నువ్వు కూడా నా మీద పెట్టే శ్రద్ధలో సగం నీ మీద పెడితే లైఫ్ ఇంకా బాగుంటుంది ఆల్ ది బెస్ట్' అంటూ రీట్విట్ ఇచ్చాడు. హరీష్ శంకర్ ఇలా రిప్లై ఇవ్వడంపై ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దర్శకుల సినిమాలను హిట్ చేసేది అభిమానులేనని హరీష్ తెలుసుకోవాలని కొందరు ఆయనకు హితవు పలుకుతున్నారు.

Recent Posts