Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మహేష్‌పై స్వీట్‌గా రివేంజ్ తీర్చుకున్న యంగ్ టైగర్








తెలుగు సినిమాల్లో హిట్ సినిమాలోని సన్నివేశాలను, పాటలను కామెడీ కోసం పెరడీ చేసి తమ సినిమాలో పెట్టుకుంటారు. ఎక్కువుగా కామెడీ స్టార్ అల్లిరి నరేష్ టాప్ హీరోల సినిమాల్లోని సన్నివేశాల్ని పెరడీ చేసి కామెడీ పండిస్తాడు. అయితే ఇప్పుడు ఈ పెరడీలు పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు.




అయితే తాజాగా విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' లేటెస్ట్ టీజర్ సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా కొత్త కామెడీ ట్రైలర్‌ని విడుదల చేసారు. ఆ ట్రైలర్‌లో మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని టైటిల్ సాంగ్‌ని కామెడీ చేసాడు ఎన్టీఆర్.




గతంలో మహేష్ సూపర్ హిట్ దూకుడులో యమదొంగలోని ఎన్టీఆర్ డైలాగ్‌ని కామెడీ చేసాడు. దానికి ప్రతిగా ఇలా ఈ చిత్రంలో సెటైర్లు వేసి స్వీట్ రివేంజ్ తీర్చుకున్నాడని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Recent Posts