Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కంటి నిండా నిద్రపోకపోతే.. అంతే సంగతులు!





మారుతున్న జీవన విధానాల కారణంగా మనలో చాలామంది రాత్రిళ్లు చాలినంతగా నిద్రపోవడం లేదు. నిద్ర చాలకపోవడం వల్ల దాని ప్రభావం మన రోజువారీ జీవితంపై చాలానే ఉంటుంది. ముందురోజు రాత్రి నిద్ర చాలకపోవడం వల్ల మరునాడు పనిమీద ఎక్కువ ఏకాగ్రత చూపలేకపోతాం. దీంతో రోజంతా చిరాకుగా ఉంటుంది.

ఇలా నిద్రలేమి వల్ల బోలెడు సమస్యలను మనం ఎదుర్కొనాల్సి వస్తుంది. అయితే నిద్రలేమి కారణంగా మతిమరుపు జబ్బు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమి, కలతనిద్ర వంటి సమస్యలతో బాధపడేవారికి అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదముందని బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మతిమరుపు, ఎదుటివారు చెప్పే మాటలను సైతం సరిగా అర్ధం చేసుకోలేకపోవడం, సరిగా నడవలేకపోవడం వంటివి అల్జీమర్స్‌ లక్షణాలు.

సరిగా నిద్రపోకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే పెద్దల మెదడులో మత్తు కలిగించే టాక్సిక్‌ ప్రోటీన్ల స్థాయి అధికమవుతుందని, ఫలితంగా అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదముందని పరిశోధకులు వెల్లడించారు.

Recent Posts