Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరట్లేదు.. అవన్నీ వదంతులే: నాగబాబు



పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను చిరంజీవి సోదరుడు నాగబాబు కొట్టిపారేశారు. క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నామని, టీడీపీ చేరుతున్నామని వస్తున్న వార్తలు నిరాధారమని ఖండించారు. ఈ మేరకు ఆయన ప్రతికా ప్రకటన విడుదల చేశారు..


ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చే తీరిక తమకు లేదని నాగబాబు స్పష్టం చేశారు. తాము వృత్తిపరంగా బిజీగా ఉన్నామని పేర్కొన్నారు. వృతికి న్యాయం చేయడమే తమ బాధ్యత అన్నారు. తాము రాజకీయ పార్టీ పెట్టడం లేదని కూడా నాగబాబు స్పష్టం చేశారు.

మీడియా కథనాలు అభిమానులను, ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయని వాపోయారు. మీడియా ఈ విధంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Recent Posts