Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సెక్స్ అంటే ఇష్టమే అంటోంది... అంగ ప్రవేశం వల్లకావడంలేదు.. ఎందుకని...?





కొంతమంది మహిళలకు సంభోగ సమయంలో బాధ కలుగుతుంది. దీనికి అనేక కారణాలుంటాయని సెక్స్ వైద్యులు చెపుతున్నారు. స్త్రీని బలవంతంగా లోబరుచుకున్నప్పుడు ఆమె అయిష్టంగా సహకరిస్తే మానసికంగా అంతులేని వ్యధ చెందుతుందని చెపుతున్నారు. శారీరకంగా ఆమె అందుకు సిద్ధంగా లేకపోవడమే. అందువల్ల శారీరకంగా విపరీతమైన బాధ కలుగుతుంది. సాధారణంగా శారీరకమైన బాధ యోనిమార్గం బిగుతుగా ఉండడం వల్ల కలుగుతుందని వైద్యులు చెపుతున్నారు.

కొంతమందికి తొలిరాత్రి ఇటువంటివి పరిస్థితి ఎదురు కావొచ్చు. దీనికి కారణాలు లేకపోలేదు. పురుషుని మీద విముఖత అనేది సాధారణమైనదైతే, ఇక పురుషుని సంపూర్తిగా ఇష్టపడుతూ రతిమీద ఆసక్తి కూడా ఉండి, భర్తకు సహకరిస్తున్నప్పటికీ రతిలో కలిగే బాధ మరొక కారణం.

తొలి రాత్రి మీద స్త్రీలకు కొద్దిగా సందేహాలు, భయాందోళనలు ఉండేది ఇందుకే. తోలిరాత్రే సక్సెస్ కావడమనేది భార్యాభర్తల ఇద్దరి మీదా ఆధారపడి ఉంటుంది. యోని మార్గం బిగుతుగా ఉండడం వల్ల కొంతమందిలో అంగప్రవేశం దుర్లభమవుతుందని చెపుతున్నారు. పురుషునికి ఇది మరింత సవాలుగా, అవమానకరంగా మారుతుంది. పరిస్థితిని గ్రహించకుండా అతను బలవంతంగా అంగప్రవేశం చేసేందుకు ప్రయత్నిస్తాడు.

ఇలా చేయడం వల్ల యోని దగ్గర వాపు కలిగే అవకాశాలున్నాయి. దీంతో వెంటనే మరోసారి రతికి సిద్ధపడితే అది మరింత బాధాకరమవుతుంది. ఇలాంటి సంఘటనలతో బెదిరిపోయిన స్త్రీలలో క్రమంగా రతి అంటే విముఖత కలుగుతుంది. ఇలాంటి సందర్భాలలో నిగ్రహం పాటించడమే మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

అలాగే, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వలన కూడా రతి బాధాకరంగా మారవచ్చని, అపుడు వైద్యులను సంప్రదించడం మేలని చెపుతున్నారు. సెక్స్ సంబంధమైన సమస్యలు సున్నితమైనప్పటికీ చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయని వైద్యులు చెపుతున్నారు.

Recent Posts