Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

స్త్రీ పురుషులు పెట్టే ముద్దులకు తేడా ఏంటి?





స్త్రీ పురుషుల వయస్సు ఏదైనా మనసులోని ప్రేమను, ఇష్టాన్ని తెలియజెప్పే ఏకైక సాధనం ముద్దు. శృంగార సామ్రాజ్యంలో ఘాటైన మత్తు మందే ఈ ముద్దు. పసి పిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు పలు రకాల ముద్దులను ప్రతి ఒక్కరు రుచిచూసే ఉంటారు. కానీ ఆ ముద్దులన్నింటికీ భిన్నమైన ముద్దు వయస్సులో ఉండగా పొందే ముద్దులు.

అంతేకాదండోయ్... యుక్త వయస్సులో ఉండే ప్రతి యువతీ యువతి పాటు ఒకరిపై ఒకరు మనస్సు పడిన స్త్రీ, పురుషులు తమ ప్రేమను తొలిగా తెలియజెప్పుకునేది ముద్దుల ద్వారానే. మధురమైన లైంగిక జీవితానికి సంకేతంగా ఈ ముద్దు నిలుస్తుంది.

పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ముద్దులు అవసరమే. ఇందులో ఎవరు ఎవరికిస్తారు, ఎవరు అందుకుంటారు అనే ప్రశ్న లేదు. సెక్స్‌లో ఆనందాలను ఎలా పంచుకుంటారో అలాగే ముద్దులలోని మాధుర్యాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.

ముద్దుల వల్ల పొందేది ఒకేలా అనిపించినా, ముద్దు పెట్టుకోవడం ఒకేలాంటిదే అనుకున్నా ముద్దులలో మగ ముద్దులు, ఆడ ముద్దులు భిన్నమైనవి. మగ, ఆడముద్దులు భిన్నమైన సందేశాలను అందిస్తాయి. మగవాడి దృష్టిలో ముద్దు సెక్స్‌కి తొలి అడుగు అయితే, ఆడవారి దృష్టిలో ముద్దులనేవి మగవాడి ప్రేమను కొలిచే సాధనంగా భావిస్తారు.

ఇరువురి పెదవుల కలయిక ముద్దుగా కనిపించినా ఆ కలయిక వెనుకున్న రసాయనం భిన్నమైనది. ముద్దు పెట్టుకునేందుకు ముఖం మీదున్న కండరాలలో ఓకే ఒక్క కండరమే పనిచేస్తుంది. అయితే ముద్దు సమయంలో ఆ కండరం ఒకటి ఎంత తీవ్రంగా పనిచేస్తుందంటే ఒక నిమిషం ముద్దుల్లో 26 క్యాలరీల శక్తి వినియోగమవుతుందంటే అతిశయోక్తి కాదేమో..!

Recent Posts