Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శోభనంనాడు సెక్స్ కోసం దుస్తులు తొలగించా... అప్పట్నుంచి దగ్గరకు రానివ్వడంలేదు...





పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో భార్యభర్తలయ్యేవారిలో ఒకరికొకరు అంతకుముందు పరిచయం ఉండదు కనుక ఎటువంటి మానసిక బంధం ఉండదు. ఇకపోతే మగపిల్లలకు 12 నుంచి 14 ఏళ్ల వయసులోనే సెక్స్ కోర్కెలు మొదలవుతాయి. ఆ తర్వాత పదేళ్లకు గాని వారికి పెళ్లికాదు. ఇప్పుడు మరీ 30 ఏళ్లు దాటిపోతోందనుకోండి.

ఇలా సెక్స్ సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు. తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు.

అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కనుక ఆ రాత్రికి వాటిని భరిస్తుంది. మానసికంగా దగ్గరైతే కానీ శారీరకంగా దగ్గరవడానికి ఇష్టపడదు స్త్రీ. పెద్దలు కుదిర్చే పెళ్లిలో ఒకరికొకరిని తెలుసుకునేందుకు అంతగా అవకాశం ఉండదు. కాబట్టి శోభనానికి ముందే భార్యభర్తలు ఒకరికొకరు కలుసుకుని, మనసు పంచుకునే అవకాశం ఇవ్వాలి.

ఇలాంటి అవకాశం ఇవ్వనందున మగవాడు సెక్స్ కోసం పడే హడావుడి, ఆడవారు సెక్స్ అంటే ఉండే భయం, గర్భం వస్తుందేమోనన్న ఆందోళన, మరోవైపు సినిమాలు, నవలల్లోలాగా తొలిరాత్రి నాడే ఆ అనుభవం తప్పక చూడాలని యత్నం చేసి చివరికి గందరగోళమవుతుంది.

దాంతో మధురమైన రాత్రిగా మిగలాల్సిన అనుభవం పీడకల అవుతుంది. కాబట్టి మొదటి రాత్రి లైంగికంగా కలవకుండా ఉండటం మంచిది. ఇద్దరూ తమ ఆలోచనలు, ఆశయాలు పంచుకుని సెక్స్ విషయంలో వారికున్నటువంటి భయాలు, సందేహాలు సరిగా అర్థం చేసుకుని ఒకరిపై మరొకరికి ప్రేమ, ఆకర్షణ కలిగిన తర్వాత లైంగికంగా కలిస్తే తొలిరాత్రి మరపురానిది అవుతుంది.

Recent Posts