Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ : ట్రైలర్ కే రెండు కోట్లు ఖర్చు

ట్రైలర్ అనేది సినిమాకు క్రేజ్ తెచ్చే ఎలిమెంట్ కాదనలేం. క్రియేటివ్ గా ఈ ట్రైలర్స్ కట్ చేసి ప్రేక్షకులకు మొదటి నుంచి సినిమాపై ఆసక్తి కలిగిస్తూంటారు. అయితే ట్రైలర్స్ పై పెట్టే ఖర్చు చాలా పరిమితంగా ఉంటుంది. అయితే అమీర్‌ఖాన్, కట్రీనా కైఫ్ జంటగా నటిస్తున్న 'ధూమ్ 3' చిత్రం ట్రైలర్ కి రెండు కోట్లు ఖర్చు పెట్టడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

 ఈ చిత్రం థియేటర్ ట్రైలర్‌ను ఐమాక్స్ ఫార్మట్‌లో విడుదల చేయబోతున్నారు. సాధారణంగా స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాల థియేటర్ ట్రైలర్లను మాత్రమే ఐమాక్స్ ఫార్మట్‌లో విడుదల చేస్తుంటారు. మొట్టమొదటి సారిగా ఓ భారతీయ సినిమా ట్రైలర్ ఈ ఫార్మట్‌లో రిలీజవబోతోంది. ప్రస్తుతం ఆ ట్రైలర్‌ను ఐమాక్స్‌లోకి మార్చే ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 30న 'ధూమ్ 3' ఐమాక్స్ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ ప్రక్రియ కోసం నిర్మాతలు ఏకంగా రూ. రెండు కోట్లను అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. ఒక ట్రైలర్ కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం ఒక భారతీయ సినిమాకి సంబంధించి ఒక విశేషంగా చెప్పుకోవాలి. కాగా ఈ సినిమాలో ఆలియా అనే పాత్ర పోషించిన కట్రీనా కైఫ్ ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించని రీతిలో ఈ సినిమా ఆమె కనిపిస్తుందనీ, అమీర్, కట్రీనా మధ్య కెమెస్ట్రీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందనీ అంటున్నారు. అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా తమ మునుపటి పాత్రల్నే పోషిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌కృష్ణ ఆచర్య డైరెక్ట్ చేస్తున్నాడు. ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈచిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. ఈసంవత్సరం ధూమ్-3తో అంతం అవుతుంది అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. అంటే ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌‍ను పురస్కరించుకుని డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ ‘ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Recent Posts