Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆస్ట్రేలియాతో చావో రేవో : టీమిండియాకు బలపరీక్ష!

వరుసగా రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో పాటు ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికీ 1-2 మ్యాచ్‌ల తేడాతో వెనుకబడి ఉన్న టీమిండియా సిరీస్‌తో పాటుగా పరువు నిలుపుకోవాలంటే బుధవారం ఆసీస్‌తో జరగనున్న ఆరో వన్డే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది.

సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన అన్ని మ్యాచ్‌లలో బౌలర్ల వైఫల్యం కారణంగా బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు సాధించినప్పటికీ ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్న ధోనీ సేనకు బుధవారం నాటి మ్యాచ్ అగ్నిపరీక్షగా మారింది.

జట్టంతా కూడా ఒక్కతాటిపై నిలిచి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని పక్షంలో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోవలసి వస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు చివరి మ్యాచ్ దాకా వేచి చూడకుండా ఈ మ్యాచ్‌ని గెలుచుకుని సిరీస్‌ను దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Recent Posts