Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మెగా ఫ్యామిలీతో పెట్టుకున్నాడు.. ఇక ఛాన్సులేం దొరుకుతాయ్..

ఒకప్పుడు పూరీ జగన్నాథ్‌ డేట్స్‌ కావాలంటే.. అగ్ర హీరోలతోనే సరిపోయేది.. చిన్నపాటి హీరోలతో సినిమాలు చేసేవాడుకాదు. కానీ కాలం మారినట్లు ఆయన ఫేటు కూడా మారిపోయింది. బిజినెస్‌మేన్‌ తర్వాత పూరీకి సరైన సినిమా లేదు. అగ్ర నిర్మాతలు ముందుకు రావడంలేదు.

హీరోతో పాటు రెమ్యునరేషన్‌ ధీటుగా అడుగుతున్నట్లు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్‌తో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత తన సోదరుడు సాయిరాం హీరోగా సినిమా చేయనున్నాడు. స్వంత నిర్మాణసంస్థలో బయట హీరోలతో సినిమాలకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో తీస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత పెద్ద చిత్రాలు తీయడం మొదలుపెట్టాడు. దాంతో నిర్మాణ సంస్థ మూలపడింది. ఇప్పుడు దాన్ని బయటకు తెచ్చాడు. అన్నట్లు ఆమధ్య పవన్ కల్యాణ్‌పై పూరీ సెటైర్లు పేల్చి కార్నర్ అయ్యాడు. దాంతోనే పూరీకి ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు సినీజనం.

Recent Posts