Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కమల్ హాసన్‌తో కాజల్ లిప్‌లాక్ సీన్!

హైదరాబాద్: యూనివర్శల్ హీరో కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్తమ విలన్'. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ....చివరకు హీరోయిన్ కాజల్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో కలిసి లిప్ లాక్ ముద్దు సీన్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ సినిమా అంటే తప్పకుండా లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే మరి. వాస్తవానికి ‘ఉత్తమ విలన్' సినిమా స్టోరీ కమల్‌తో ఓకే అయిన వెంటనే....


 కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని నుకున్నారు. కానీ అప్పుడు డేట్స్ లేవంటూ కాజల్ తిరస్కరించింది. ఆ తర్వాత ఇతర హీరోయిన్లను తీసుకుందామని అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల ఓకే కాలేదు. ప్రస్తుతం కాజల్ అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో ఆ అవకాశం తిరిగి తిరిగి మళ్లీ ఆమె వద్దకే చేరింది. కమల్ హాసన్ | కాజల్ ఉత్తమ విలన్ చిత్రానికి క్రేజీ మోహన్ రచయితగా పని చేస్తున్నారు. ప్రముక తమిళ నిర్మాతలు తిరుపతి బ్రదర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.

Recent Posts