Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

`దూకుడు` ఒక ట్రైలర్ మాత్రమేనట!

మహేష్ బాబు - శ్రీనువైట్ల కలయికలో తెరకెక్కిన `దూకుడు` సంచలనాలు సృష్టించింది. వసూళ్ళలో సరికొత్త రికార్డులను సెట్ చేసింది.  అందుకే ఆ కలయికలో మరో సినిమా అనగానే అందరూ ఆసక్తిని వ్యక్తం చేశారు. `ఆగడు` సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఘడియ రానే వచ్చింది. .
శుక్రవారం హైదరాబాద్ లో `ఆగడు` మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి రామానాయుడు క్లాప్ నిచ్చారు. శ్యాం ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

 ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ... ``మహేష్ బాబును నేను ఎలా చూడాలనుకుంటున్నానో అలాగే ఉంటుందీ చిత్రం. ఆయన క్యారెక్టర్ ఇందులో ఫుల్ మాసీగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే `దూకుడు` సినిమా `ఆగడు`కి ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. మహేష్ బాబులోని ఓ కొత్త కోణం ఈ సినిమాతో బయటపెడుతున్నాం. `దూకుడు` తర్వాత చేస్తున్న ఈ సినిమాపై నెలకొన్న అంచనాలన్నిటినీ అధిగమిస్తాం. అభిమానులు  సందడి చేసుకునేలా ఈ చిత్రం ఉంటుంది`` అన్నారు. ఇందులో కథానాయికగా తమన్నా నటిస్తోంది. నవంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు `1` సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు.  

Recent Posts