Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అత్తారింటికి వెళ్ళిన బాలయ్య!

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రానున ఎన్నికల్లో ఆ  పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనబోతున్నారని సమాచారం. పసుపు జెండాకి పవన్ ని దగ్గర చేయడంలో  రామోజీ రావు కీలక పాత్ర పోషించారని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఆ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ... పవన్ సినిమా `అత్తారింటికి దారేది`ని మాత్రం బాలకృష్ణ ప్రత్యేకంగా తిలకించారట..
 

బాలయ్య కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటు చేయించినట్టు సమాచారం. బాలకృష్ణతో పాటు  ఆయన కుటుంబ సభ్యులు ఈ సినిమాని తిలకించారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని బాలయ్య తన ఇంటికి ఆహ్వానించారట. బాలకృష్ణ ఇంట్లో సమావేశమైన ఇద్దరూ చాలాసేపు రాజకీయాల గురించి చర్చించికున్నట్టు సమాచారం. మరి పవన్ కళ్యాణ్ నిజంగానే తెలుగు దేశం పార్టీలో చేరతాడా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ `గబ్బర్ సింగ్ 2` సినిమాకి సంబంధించిన పనుల్లో తలమునకలై ఉన్నారు.

Recent Posts