Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పవన్ సినిమాకి వందకోట్లు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `అత్తారింటికి దారేది` వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. సినిమా విడుదలై పాతిక రోజులైనా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. థియేటర్లన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే రూ: 75 కోట్లు మేర వసూళ్లు సాధించిందట. త్వరలోనే వందకోట్ల క్లబ్ లోకి చేరబోతోందని నిర్మాత భోగవల్లి ప్రసాద్ చెబుతున్నారు..


సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భోగవల్లి ప్రసాద్ మాట్లాడుతూ... ``ఇలాంటి సినిమాని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం. వందేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మా సినిమా నిలవబోతోంది. ఇప్పటికే పలుచోట్ల `మగధీర` రికార్డ్స్ ని అధిగమించింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వల్లే ఈ సినిమా ఇంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది`` అన్నారు. సమంతా మాట్లాడుతూ... ``ఈ సినిమా విజయవంతం అవ్వాలని నేను వ్యక్తిగతంగా చాలా ఎంతగానో కోరుకున్నా. బి.వి.యస్.యన్.ప్రసాద్ మంచి నిర్మాత. అలాగే పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద అభిమానిని. ఈ సినిమా చేశాక ఆయనపై అభిమానం రెట్టింపైంది. ఆయన నా గురించి సక్సెస్ మీట్లో మాట్లాడడం ఎంతో ఆనందాన్నిచ్చింద``ని చెప్పుకొచ్చింది.

Recent Posts