Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అబ్బా గ్యాప్ ఇవ్వండి బాబూ ఓపిక లేదు.. అంటున్న శృతిహాసన్

ఏమైందో ఏమో గానీ ఇప్పుడు సౌత్ ఇండియా హీరోయిన్లందరి నోట ఒకే మాట షూటింగ్‌లకు గ్యాప్ కావాలి అని. ఒకప్పుడు హీరోయిన్‌గా అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ భామలే ఇప్పుడు విరామం కోసం ఎదురుచూస్తున్నారు. మొన్న కాజోల్.. చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుని ఫారిన్‌కి వెళ్లి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసి వచ్చింది.

అలాగే సమంత కూడా కొత్త సినిమాలకు నో చెప్పింది. ఆ మధ్య తమన్నా కొద్దిరోజులు విరామం తీసుకుంది. ఇంకా రీచా గంగోపాధ్యాయ్ అయితే ఏకంగా చదువుకుంటానంటూ ఫారిన్‌కు చెక్కేసింది. ఇప్పుడు తాజాగా శృతిహాసన్ కూడా ఈ కోవలోకి చేరిపోయింది. తొలుత నటించిన చిత్రాలేవీ పెద్ద హిట్ కాకపోవడంతో ఐరెన్‌లెగ్ బ్యూటీగా పెరుతెచ్చుకున్న ఈ భామ వరుస హిట్‌లతో గోల్డెన్‌లెగ్ బ్యూటీగా ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది.

అయితే శృతిహాసన్‌కు ఇప్పుడు కొంత విరామం కావాలంటోంది. తన తల్లి సారిక తనతో కొద్దిరోజులు ఉండాలని అడిగిందట. దీంతో శృతి తన సినిమాలకు కొంత విరామం ఇచ్చిందని సమాచారం. ఇప్పుడు తనకు కొంచెం గ్యాప్ ఇవ్వాలని వరుస షూటింగ్‌లతో ఓపిక లేకుండా పోయిందని శృతి దర్శకనిర్మాతలను కొంత విరామం కావాలని అడిగిందట.

Recent Posts