Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

వోల్వో బస్సు ప్రమాదం మృతుల వివరాలు ఇవే...

వోల్వో బస్సు ప్రమాదానికి సంబంధించి బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ నుంచి 29 మంది ప్రయాణికుల పేర్లు అందాయని మహబూబ్ నగర్ ఎస్పీ నాగేంద్రకుమార్ వెల్లడించారు.
బస్సు డీజిల్ ట్యాంకు పేలడం వల్లనే ప్రమాదం సంభవించి ఉంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఆయన చెప్పారు. మృతుల బంధువులకు వివరాలను అందజేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. 

కాగా, దగ్ధమైన వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలను బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ ప్రతినిధి తెలిపారు. వీరి సమాచారం ప్రకారం బస్సులో గాలి బాల సుందర రాజు (54), గాలి మాను విజయకుమారి (50), షోయబ్, అజహర్ (41), అక్షయ్ సింగ్, శక్తికాంత్ (28), రఘువీర, సురేష్ బాబు, ఫణికుమార్ (28), గౌరవ్ విక్రాంత్ రాయ్, కిరణ్ (30), కృష్ణ (36), అడారి (27), జ్యోతి (33), ప్రశాన్ గుప్తా (23), అమర్ (31), వేదవతి (27), రామరాజు (30), వెంకటేష్(45), మొహిద్దీన్ (21), వెంకటేష్ (50), చంద్రశేఖర్ (41), హఫీజ్ (45), పూటియా (28), రాజేష్ (28), మహ్మద్ సర్ధార్, ఎండీ. అసిఫ్ (35), రేణుక (28), రవి (27), రామరాజు దినేష్ (30), నాగప్ప, మోసిన్ (21) ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.

Recent Posts