Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

వోల్వో బస్సు ప్రమాదంపై కిరణ్ - బాబు - జగన్ దిగ్భ్రాంతి

 మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన వోల్వో బస్సు అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వోల్వో బస్సు పాలెం వద్ద కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ఆ వెంటనే డీజిల్ ట్యాంకు పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న 49 మంది ప్రయాణికుల్లో ఐదుగురు మినహా మిగిలిన వారంతా సజీవదహనమయ్యారు. 

ఈ ఘటనపై సీఎం కిరణ్, చంద్రబాబు, జగన్‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమయంలో మెలకువతో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్, క్లీనర్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

Recent Posts