Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

న‌న్నుకొనుక్కోండి, నా అవ‌స‌రాలు తీర్చండి అంటున్న కంగనా రనౌత్..

నన్నుకొనుక్కోండి, నా అవసరాలు తీర్చండి అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. త‌న న‌ట‌న‌తో నేష‌న‌ల్ అవార్డును గెలుచుకున్న ఈ హీరోయిన్‌కు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటే పొరపాటే. ఆమె తాజాగా 'రజ్జో' అనే సినిమాలో వేశ్యగా నటిస్తోంది. ఆ సినిమా కోసం ఆమె ఇటువంటి డైలాగులు పలుకుతోంది. నవంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కంగ‌నా పాత్ర ఎంతో ముఖ్యమైన‌ది. ఇందులో ఆమె వేశ్యగా నటిస్తోంది. ఈ మూవీలో కంగ‌నా పాత్ర అవ‌స‌రాల కోసం అమ్ముడుపోతున్న వేశ్యగా ఉంటుంది. ఈ పాత్రకు సంబంధించిన ఎన్నో విష‌యాల‌ను కంగనా చెప్పుకొచ్చింది. 'ఇందులో నేను ముజ్రావాలీ(వేశ్య) పాత్రలో నటిస్తున్నాను. నేనెంతో ఇష్టపడిన పాత్ర ఇది. ఇందులో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది.

నా నటన నన్నెంతగానో సంతృప్తిపర్చింది. పండుగల సీజన్‌లో విడుదల చేయడం మరింత ఆనందంగా ఉంది. నిర్మాతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పింది. ఇదిలావుండగా చిత్రంలో కంగనాతో పాటు ప్రకాశ్‌రాజ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రద, పరాస్ అరోరా నటిస్తున్నారు. ఫోర్ పిల్లర్స్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది

Recent Posts