Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మాదాపూర్ టెక్కీ రేప్... పొద్దుపోయాక క్యాబ్ ఎక్కితే అంతేనా...?!!





హైదరాబాద్‌లోని మాదాపూర్లోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే యువతిని నాలుగు రోజుల క్రితం కిడ్నాప్, అత్యాచారం చేసిన కేసుకు సంబంధించి నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు పాల్పడిన సతీష్, వెంకటేశ్వర్ల అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందుంచారు. వోల్వో కారులో కిడ్నాప్ చేసిన దుండగులు మెదక్ జిల్లా కొల్లూరు వద్ద బిర్లా స్కూలు సమీపంలో యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ నెల 18న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆమెను కిడ్నాప్ చేసి.. ఆరు గంటలపాటు ఆమెను చిత్రహింసల పాల్జేసినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా నిందితులను గుర్తించినట్టు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

నిందితుల్లో ఒకరు మాట్లాడుతూ.. తాను కావాలని ఆమెపై అత్యాచారం చేయలేదని తన స్నేహితుడు ఆమెపై అత్యాచారం చేయకపోతే చంపేస్తానని బెదిరించాడనీ, అందువల్ల విధిలేని పరిస్థితిలో ఆమెపై అత్యాచారం చేశానని చెప్పాడు.

అంతేకాదు ఆ అమ్మాయిపై రేప్ చేసినా పోలీసులకు చెప్పదనీ, ఒకవేళ చెపితే పరువు పోతుంది కనుక ఎంతమాత్రం చెప్పే ఛాన్సు లేదని తనతో చెప్పి ధైర్యంగా ఆమెపై అత్యాచారం చేయించాడని చెప్పడాన్ని బట్టి చూస్తే ఇంతకుముందు నిందితుడు ఎంతమంది అమ్మాయిలపై అత్యాచారం చేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వీరిద్దరిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Recent Posts