Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఎవరీ శోభన్ సర్కార్?.. బంగారం నిధి కలయా?.. నిజమా?..





శోభన్ సర్కార్.. నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న యూపీ నిధిని కలగన్న సాధువు! ఈయన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ (దేహత్) జిల్లా మైతా బ్లాక్‌లోని శకుల్నాపూర్వ గ్రామంలో జన్మించారు. కాన్పూర్ నగర్ జిల్లాలోని మంధన పట్నంలో బీపీఎంజీ ఇంటర్ కాలేజ్‌లో విద్యాభ్యాసం చేశారు.

చిన్నవయసు నుంచే ఆధ్యాత్మిక భావాలవైపు ఆకర్షితుడైన ఆయన... చదువుకునే రోజుల్లోనే శ్రద్ధగా గీతాపఠనం, రామ్‌చరిత మానస్ అధ్యయనం చేసేవారిని స్థానికులు చెబుతున్నారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక ఇల్లు వదిలి వెళ్లిపోయి స్వామి సత్సంగానంద్ వద్ద శిష్యరికం చేశారు.

ఎనిమిదేళ్లపాటు ఈయన దగ్గర శిష్యుడిగా ఉన్న శోభన్ సర్కార్ తర్వాత సొంతగా ఆశ్రమం నిర్మించుకున్నారు. దానికి అనుబంధంగా ఉన్న గ్రామాలన్నింటికీ రోడ్లను నిర్మించారు. వివిధ గ్రామాల్లో దేవాలయాలు నిర్మించి ధర్మప్రచారం చేశారు.

దీంతో స్థానికులు ఆయన మాటలను నమ్ముతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గుప్తనిధి విషయంలో స్థానికులు స్వామితో ఏకీభవిస్తున్నారు. ఆయనకు వచ్చిన కల నిజమేనని తప్పకుండా అక్కడ బంగారు నిధి ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ నిధి తవ్వకాలు ఇంకా కొనసాగితున్నాయి. భారీ భద్రత నడుమ ఈ తవ్వకాలను చేపడుతున్నారు. ఇప్పటికీ నిధి దొకలేదు. దీంతో చాలా మంది చాలా విధాలుగా చర్చించుకుంటున్నారు. అసలు స్వామిజీ కల నిజమవుతుందై లేక కలలానే మిగిలిపోతుందా అని అనుకుంటున్నారు.

Recent Posts