Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆఫీసుల్లో తూగుతున్నారా..? ఐతే ఈ చిట్కాలు పాటించండి!





చాలామందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర పోవడం అలవాటుగా ఉంటుంది. దీంతో ఎక్కడున్నా భోజనం కాగానే నిద్ర ఆగకుండా వస్తుంది. ఈ నిద్రను అదుపు చేయడానికి మన ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

భోజనం సుష్టుగా లాగించకుండా పోషకాలతో కూడిన ఆహారాన్ని కొంత మోతాదులో తీసుకున్నా సరిపోతుంది. పోషకాలతో కూడివుంటుంది గనుక కొంత తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని ఫలితంగా భుక్తాయాసం లేకుండా ఉంటుంది. నిద్ర దూరంగా ఉంటుంది.

అలాగే భోజనం తర్వాత కొంతసేపు మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి. ఐదు లేదా పది నిమిషాల పాటు ఇలా సంగీతాన్ని వినడం వల్ల మీకు నిద్ర పోవాలనే భావన దూరమవుతుంది. భోజనం చేసిన తర్వాత కంప్యూటర్‌ ముందు కూర్చోవడం, టీవీ చూడడం చేయకుండా శరీరానికి శ్రమ కలిగించే పనిలోకి దిగడం మంచిది.

చేతుల్ని పైకెత్తడం, ముందుకు చాపడం, అటూ ఇటూ నడవడం, ఎండలో కాస్త తిరగడం వంటివి చేయడం వల్ల కండరాలు విశ్రాంతిగా ఉంటాయి. దీని ఫలితంగా శరీరం, మనసు ఉల్లాసంగా మారతాయి.

తోటి ఉద్యోగులతో కాసేపు మాట్లాడినా కూడా మంచి ఫలితమే ఉంటుంది. లేదా చక్కటి కాఫీ లేదా టీ తాగితే ఇక నిద్ర మత్తు ఫట్‌మంటూ వదిలిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Recent Posts