Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మొన్న మహేష్... ఇప్పుడు రామ్... త్వరలో రామ్ చరణ్... వెంకీ 'అన్నయ్య'





విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు.. హీరోగా సినిమాలన్నీ హిట్లే. ప్రస్తుతం వయస్సురీత్యా.. హీరో కథలకు సూట్‌ కావడంలేదు. పెళ్లికాని ప్రసాద్‌ లాంటి పాత్రలు పోషించి... విసుగుపుట్టింది. అందుకే కుర్రహీరోలతో జోడీ కట్టేస్తున్నాడు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఊపునిస్తున్నాడు. ఇటీవలే హీరో రామ్‌తో 'మసాలా' చేశాడు. అది వచ్చేనెలలో విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా మరో చిత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ హీరో. ఆయనతోపాటు వెంకటేష్‌ నటిస్తున్నాడు. వెంకటేష్ సరసన నయనతార బుక్‌ అయింది. విశేషం ఏమంటే ఇందులో కాస్త వయస్సు మళ్లిన పాత్రను వెంకటేష్‌ పోషించడం.

రామ్‌ చరణ్‌ పక్కన ఆయనకు లక్కీ గాళ్ కాజల్‌ నటించనుంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. సీతమ్మ... చిత్రం తర్వాత వెంకీ వరుసగా తన రూటు మార్చేసుకున్నాడు.

Recent Posts