Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు: వరదలతో 11 మంది మృతి!

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన రహదారులపై వరద నీరు వచ్చి చేరుతోంది.

చెరువులు నిండిపోయాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద నీటికి పలు నదులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలు వాగుల్లో చిక్కుకుపోయాయి.

హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, మహబూబ్‌నగర్, ప్రకాశం, నల్గొండ, విశాఖపట్నం,వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మృతి చెందినట్లు సమాచారం.

Recent Posts