Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. ?



’సమైక్యశంఖారావం’ సభ ద్వారా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి పలు సూటి ప్రశ్నలు సంధించారు. సోనియాకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుసా.. ? అని ప్రశ్నించారు. భారత పౌరసత్వం తీసుకున్న వారందరూ దేశం విడిచి వెళ్ళాలని బిల్లు తెస్తే ఆమెకు నచ్చుతుందా.. ? అని ప్రశ్నించారు.. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం అని జగన్ అభివర్ణించారు. 30 స్థానాలు మనమే సాధించుకుని ఢిల్లీ కోటను బద్దలు కొడదామని, ఢిల్లీ రాజకీయాన్ని మనమే శాసిద్దామని అన్నారు.

శంఖం ఊది.. ’సమైక్యశంఖారావం’ సభలో ప్రసంగాన్ని ప్రారంభించిన జగన్.. వరదల వల్ల ఆటంకం కలిగినా.. సభకు లక్షలాదిగా తరలివచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు జగన్. మధ్య మధ్యలో పిట్ట కథలు చెబుతూ.. ఆయన ప్రసంగం ఆమాంతం సమైక్య హోరులో ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. విభజనకు కారణమైన వారిని, పరిస్థితులను, విభజన వల్ల కలిగే నష్టాలను ఏకరువు పెడుతూనే.. వచ్చే ఎన్నికల్లో అన్ని ఎంపీలు సీట్లను కైవసం చేసుకొని ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించాలని పిలుపునిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. . ఇంకా జగన్ ప్రసంగ ప్రవాహం కొనసాగుతూనే వుంది…

Recent Posts