Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మా 'భాయ్‌' మొదటి రోజు కలెక్షన్స్... రూ. 4.8 కోట్లు: రివ్యూ

అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రై. లిమిటెడ్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్‌ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'భాయ్‌'. అక్టోబర్‌ 25న నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్‌ థియేటర్స్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి ట్రెమండస్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. .
యూత్‌ని, మాస్‌ని, ఫ్యామిలీస్‌ని అందర్నీ ఆకట్టుకున్న ఎంటర్‌టైనర్‌గా అన్నిచోట్ల చాలా మంచి టాక్‌ వచ్చింది.

ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎన్‌.సాయిబాబు మాట్లాడుతూ- ''హెవీ రెయిన్స్‌లో సైతం ఈ సినిమా ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్‌లో 4 కోట్ల 8 లక్షల షేర్‌ కలెక్ట్‌ చేసి నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్‌ చాలా స్ట్రాంగ్‌గా వున్నాయి. నాగార్జున స్టైల్‌, నాగార్జున మీద తీసిన సాంగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, అలాగే నాగార్జున, బ్రహ్మానందం కాంబినేషన్‌లో తీసిన కామెడీ సీన్స్‌ బాగా హైలైట్‌ అయ్యాయి. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, నాగార్జునగారి అభిమానులకు థాంక్స్‌'' అన్నారు.

దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ - ''అన్నపూర్ణ స్టూడియోస్‌ వంటి పెద్ద బేనర్‌లో ఈ సినిమా చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నిచోట్ల నుంచి సూపర్‌హిట్‌ టాక్‌ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాని ఆడియన్స్‌తో కలిసి చూశాను. ఆడియన్స్‌ చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీగా 'భాయ్‌'ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలా హయ్యస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

కింగ్‌ నాగార్జున, రిచా గంగోపాధ్యాయ, నథాలియా కౌర్‌, కామ్న జెఠ్మలాని, హంసా నందిని, సోను సూద్‌, ఆశిష్‌ విద్యార్థి, డా|| బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్‌, సుప్రీత్‌, అజయ్‌, ఎం.ఎస్‌.నారాయణ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, నాగినీడు, జరాసా, వినయప్రసాద్‌, సంధ్యా ఝనక్‌, చలపతిరావు, రాహుల్‌ దేవ్‌, వెన్నెల కిషోర్‌, ప్రసన్న, ప్రభాస్‌ శ్రీను, కాశీవిశ్వనాథ్‌, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్‌, నర్సింగ్‌ యాదవ్‌, ఫిష్‌ వెంకట్‌, పృథ్వి, దువ్వాసి మోహన్‌, శ్రావణ్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, మాటలు: సందీప్‌, రత్నబాబు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌, అడిషనల్‌ డైలాగ్స్‌: ప్రవీణ్‌, శృతిక్‌, ఫైట్స్‌: విజయ్‌, డ్రాగన్‌ ప్రకాష్‌, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌: నాగేంద్ర, డాన్స్‌: బృంద, గణేష్‌ స్వామి, అడిషనల్‌ స్క్రీన్‌ప్లే: విక్రమ్‌ రాజ్‌, కో-డైరెక్టర్‌: గంగాధర్‌ వర్థినీడి, కాస్ట్యూమ్స్‌: పి.శేఖర్‌బాబు, ఎస్‌.కె.ఫిరోజ్‌, మేకప్‌: గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌.సాయిబాబు, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వీరభద్రం.

రివ్యూ:

నటీనటులు: నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్, ఆశిష్‌ విద్యార్థి, సోనూసూద్‌, అజయ్‌, బ్రహ్మానందం తదితరులు, సంగీతం: దేవీశ్రీప్రసాద్‌, నిర్యాత: రిలయన్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌, కథ, కథనం, దర్శకత్వం : వీరభద్రమ్

నాగార్జున సినిమా అంటే ఆసక్తి ఉంటుంది. మాస్‌, క్లాస్‌ చిత్రాలు చేసే ఆయన ఈసారి ఏకంగా గతంలో చేసిన మాఫియా నేపథ్యాన్ని ఎంచుకున్నారు. దానికితోడు పూలరంగడు వంటి కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరభద్రమ్‌ చౌదరి చేయడం మరో విశేషం. మరి వీరిద్దరి కలయికలో సినిమా ఎలా వచ్చిందో చూద్దాం.

కథలోకి వెళితే...
థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ మాఫియా కార్యకలాపాలు చేసే డాన్‌ డేవిడ్‌(ఆశిష్‌ విద్యార్థి)కి ఇద్దరు కొడుకులు సోనూసూద్‌, అజయ్‌. వారికంటే తనకు నమ్మకంగా కుడిభుజంగా ఉండే భాయ్‌(నాగార్జున)ను నమ్ముతాడు. అయితే.. హైదరాబాద్‌లో తన కనుసన్నలతో మెలిగే గ్యాంగ్‌ను ఓ పోలీసు ఆఫీసర్‌ అర్జున్‌(ప్రసన్న) కంట్రోల్‌ చేస్తుంటాడు.

అతడిని నివారిచండానికి డేవిడ్, భాయ్‌ను పంపిస్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక భాయ్‌కు అతను సోదరుడే. ట్విస్ట్‌ ఏమంటే అక్కడ తనకో చెల్లెలు ఉటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో భాయ్‌ ఓ మామూలు వ్యక్తి. తనకు పని అప్పగించిన డేవిడ్‌ పనిని చేయకుండా ఏవో కథలు చెబుతుంటాడు. చివరికి భాయ్‌ చేసే పనులు తెలుసుకుని డేవిడ్‌ రాకతో కథ ఏ మలుపు తిరిగింది? అనేది సినిమా.

భాయ్‌పరంగా నాగార్జున డిఫరెంట్‌ లుక్‌తో కన్పిస్తాడు. థాయ్‌ లుక్‌తో టోపీతో చిత్రంగానూ కన్పిస్తాడు. ఎక్కువగా స్టైలిష్‌గా కన్పించాడు. రొమాంటిక్‌, కామెడీ, సెంటిమెంట్‌ పండించడానికి ట్రై చేశాడు. రిచా పాత్ర జస్ట్‌ ఓకే. ప్రసన్న పోలీసు ఆఫీసర్‌గా ఫర్వాలేదు. నటి స్నేహ సోదరుడు ఈయన. షిండే, రఘబాబు, వెన్నెలకిషోర్‌, బ్రహ్మానందం పాత్రలు ఫర్వాలేదు. అయితే బ్రహ్మానందాన్ని పెట్టుకుని సరైన కామెడీ చేయించడంలో దర్శకుడు ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి.

అసలు సినిమాకు కథ ముఖ్యం. దాన్ని దర్శకుడు సరిగ్గా డీల్‌ చేయలేకపోయాడనే చెప్పాలి. పాత కథలు చాలా వచ్చాయి. హీరో ఎక్కడో పెరగడం.. చిన్ననాటి గుర్తులు మళ్ళీ తెలుసుకుని ఫ్యామిలీని కలవడం వంటి పాత ఫార్ములాను తీసుకోవడం అందుకు హీరో కూడా అంగీకరించడం... కోట్లు పెట్టి సినిమా తీయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

నాగార్జునను మాఫియాగా కింగ్‌, డాన్‌ వంటి చిత్రాల్లో చూసేశారు. మళ్ళీ అదే కాన్సెప్ట్‌తో ఏదో చేయాలని దానికి కామెడీ చేయడం అతకలేదు. నాగార్జునను మాఫియా డాన్‌గా ఇంట్రడక్షన్‌ కూడా అంతగా బాగోలేదు. థాయ్‌లాండ్‌ గెటప్‌ చూస్తే.... వెంకటేష్‌ ఆమధ్య షాడోలో వేసిన కొత్త గెటప్‌ గుర్తుకు వస్తుంది.

దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం ఫర్వాలేదు కానీ.. అనుకున్నంత క్యాచీగానూ ఏమీలేదు. సాహిత్యపరంగా బాగున్నా... మ్యూజిక్‌ డామినేట్‌ చేసేసింది. భాయ్‌ అనే టైటిల్‌ సాంగ్‌ దూకుడలో సాంగ్‌ గుర్తుకు వస్తుంది. హీరోయిన్లు హంసానందిని, కామ్నాజఠ్మలానీ వంటివారున్నా.. కేవలం నిమిత్తమాత్రమే. ఆర్ట్‌ పనితం చాలా ఉంది. ఖర్చంతా సెట్లకే అయినట్లుంది. ఓల్డ్‌ సిటీ సెట్‌ను అన్నపూర్ణలో వేసి తీశారు. అక్కడ సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. పాత పార్ములాలోనే ఉన్నాయి.

చిత్రంలో ప్రధానంగా హీరోలు చూడాల్సింది కథ. ఆ కథను దర్శకుడు 7 ఏళ్లనాడు రాసుకున్నానని చెప్పాడు. అటువంటి కథను ఈతరంలో తీసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కేవలం హీరో డేట్స్‌ ఇచ్చాడని కథను రాసేసుకుంటే చాలా పొరపాటు. మొదటి భాగం చప్పగా సాగుతుంది. సెకండాఫ్‌ చిత్రానికి కీలకం. కానీ.. దాన్ని కూడా ఆకట్టుకునేలా తీయలేకపోయాడు. ఏదో గందరగోళంగా సాగుతుంది. దాంతో చూసేవాడికి బోర్‌ కొడుతుంది.

ఇప్పటికే అగ్రహీరోల చిత్రాలు బాక్సీఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో... ఈపాటికే మిగిలిన హీరోలు తమ కథలు, కథనాలు మార్చుకుంటున్నారు. కానీ నాగార్జున ఇంకా తన పాత ఫార్ములానే ఎంచుకుని.. కథ విషయంలో బ్యాలెన్స్‌ తప్పినట్లు కన్పిస్తుంది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి.

Recent Posts