Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మహేష్ బాబు కొత్త రికార్డు... కర్ణాటకలో భారీగా...





మహేష్ బాబు నటిస్తున్న '1' సినిమా ఇంకా షూటింగు దశలో ఉండగానే అప్పుడే రికార్డులు నెలకొల్పడానికి రెడీ అయిపోతోంది. ఈ సినిమాకు మన రాష్ట్రంలో అన్ని ఏరియాలలోనూ మంచి బిజినెస్ జరుగుతుండగా, తాజాగా కర్ణాటక ప్రాంతం పంపిణీకి సంబంధించి సరికొత్త రికార్డు కొట్టినట్టు చెబుతున్నారు..


ఈ సినిమా కర్ణాటక ప్రదర్శన హక్కులు 4.5 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. తెలుగు సినిమాలకు సంబంధించి ఇది కొత్త రికార్డని అంటున్నారు. ఆర్.ఎన్.అర్ సంస్థ ఈ రేటు ఆఫర్ చేసి, కర్ణాటక రైట్స్‌ను తాజాగా సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంచితే, ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూలును పూర్తి చేసుకుని యూనిట్ హైదరాబాదు చేరుకుంది. త్వరలో మంగుళూరులో మరో షెడ్యూలు మొదలవుతుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి సనాన్ కథానాయికగా నటిస్తోంది.

Recent Posts