'బుజ్జిగాడు' భామకు నిర్మాత లైంగిక వేధింపులు... తనతో గడపాలని డిమాండ్

ప్రభాస్, త్రిష జోడిగా నటించిన 'బుజ్జిగాడు' సినిమాలో త్రిషకు చెల్లిగా నటించిన నటి సంజనను నిర్మాత లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పెర్కొంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ శివ కేశవ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాత నాగరాజు తనను లైంగికంగా వేధిస్తున్నాడని హీరోయిన్ సంజన అంటోంది.
తనతో కొన్ని గంటలపాటు గడపాలని అతడు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించింది. అయితే, తాను అతడి కోరికను తిరస్కరించానని తెలిపింది. చాలామంది దర్శకులు, నిర్మాతలు.. హీరోయిన్లను, ఇతర నటీమణులను ఇలాగే వేధిస్తున్నారని వివరించింది.
కాగా, ఆర్వీ సుబ్రమణ్యం దర్శకత్వంలో వస్తున్న శివ కేశవ్ చిత్రంలో సంజన.. నాగేంద్రబాబు, శ్వేతాబసు ప్రసాద్, జయంత్, రేణు శర్మలతో కలిసి నటిస్తోంది. దివంగత శ్రీహరి కూడా ఈ సినిమాలో నటించారు. సంజన.. బుజ్జిగాడు, యమహోయమ, పోలీస్ పోలీస్, నేనేం చిన్నపిల్లనా.. వంటి చిత్రాల్లో నటించింది.
You may also Like
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼