Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆరుసార్లు ఆరురకాలుగా పెళ్లి చేసుకుంటానంటున్న ప్రియాంక చోప్రా





మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఆరు సార్లు పెళ్లి చేసుకుంటానని ఆమె చెబుతున్న విషయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. అయితే అందరు ఇక్కడే పప్పులో కాలేసారు.

అయితే ఈ విషయంలో ప్రియాంక చోప్రాను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఒక్కడిని మాత్రమే...కానీ ఆరు సార్లు ఆరు రకాలుగా పెళ్లి చేసుకోవాలనేది ఆమె చిరకాల కోరికట.

ఇటీవల ఫిల్మ్‌ఫేర్ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మ్యారేజ్ ప్లాన్ గురించి వెల్లడించింది. 'అందరు ఆడపిల్లల్లానే నాకు పెళ్లి విషయంలో చిన్నప్పటి నుండే చాలా ప్లాన్స్ ఉన్నాయి. డిఫరెంటు పద్దతుల్లో ఆరు సార్లు పెళ్లి చేసుకోవాలని ఉంది...

అఫ్ కోర్స్ ఒకరినే అనుకోండి. ప్రతిసారి డిఫరెంటుగా చేసుకోవాలి. మొదట మా పూర్వీకుల స్వస్థలం అయిన అంబాలాలో నా పెళ్లి జరగాలి, అక్కడ మొత్తం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వేడుక జరుపుకోవాలి అని వెల్లడించారు.

రెండో సారి వివాహం ఆస్ట్రేలియాలోని గ్రేట్ బార్రియర్ రీప్‌లో అండర్ వాటర్లో పెళ్లి చేసుకోవాలని. మూడో సారి హాలీవుడ్ సినిమా స్టైల్లో డ్రెస్ వేసుకుని లాస్‌వెగాస్‌లో చేసుకోవాలని ఉంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని స్మాల్ చర్చ్ లాకార్నోలో, అనంతరం నిఖా పద్దతిలో చేసుకోవాలని ఉంది. నిఖా అనేది ఎంతో బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ సెర్మనీ అని నా భావన.

చివరది ఎలా అనేది నాకు కాబోయేవాడు నిర్ణయిస్తాడు అని చెప్పుకొచ్చొంది ప్రియాంక. ఇన్ని విషయాలు చెప్పుకొచ్చిన ప్రియాంక....మరి ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అంటే మాత్రం, ఆ విషయం ఇప్పుడే చెప్పలేనంటోంది. పాపం షాహిద్ కపూర్‌ని ఎంతో నమ్మింది... ఏమి చేస్తాం...విధి వీల్లిద్దరిని దూరం చేసింది.

Recent Posts