Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కంప్యూటర్ షడ్‌డౌన్ చేసేముందు పాటించవల్సిన జాగ్రత్తలు!

కంప్యూటర్ నిర్వహణ పై ఇప్పుడిప్పుడే అవగాహనను ఏర్పరుచుకుంటున్న వారికి కంప్యూటర్ షట్‌డౌన్ చేసేముందు తీసుకోవల్సిన జాగ్రత్తలను నేటి ప్రత్యేక కథనంలో భాగంగా సూచిస్తున్నాం. పనిపూర్తియిన అనంతరం మీ పర్సనల్ కంప్యూటర్‌ను ఆపివేయాలనుకున్నప్పుడు ముందుగా డెస్క్‌టాప్ పై రన్ అవుతున్న ప్రోగ్రామ్‌లను క్లోజ్ చేయాలి. తరువాతి క్రమంలో డెస్క్‌టాప్ మూలన కనిపించే స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి. వెంటనే స్టార్ట్ అప్ మెనూ ఓపెన్ అవుతుంది. స్టార్ట్‌అప్ మెనూలోని ‘షట్ డౌన్'బటన్ పై క్లిక్ చేసినట్లయితే మూడు ఆప్షన్‌లతో కూడిన డయలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. వీటిలో షట్‌‍డౌన్ బటన్ నొక్కగానే తెర బ్లాంక్ అయిపోతుంది. స్ర్కీన్ పూర్తి బ్లాంక్ అయిన తరువాతనే కంప్యూటర్ షట్‌డౌన్ అయ్యిందన్న నిర్థారణకు రావాలి. 

షడ్‌డౌన్ చేసేముందు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన అంశాలు: - ముందుగా డెస్క్‌టాప్ పై రన్ అవుతున్న ప్రోగ్రామ్‌లను క్లోజ్ చేయాలి. - ప్రోగ్రామ్‌లను క్లోజ్ చేసిన వెంటనే డెస్క్‌టాప్ మూలన కనిపించే స్మార్ట్ బటన్‌ను క్లిక్ చేయండి. - వెంటనే ప్రత్యక్షమయ్యే స్టార్ట్‌ అప్ మెనూలో ‘షట్‌డౌన్' ఆప్షన్‌‌ను సెలక్ట్ చేసుకోండి. - స్ర్కీన్ పూర్తిగా బ్లాంక్ అయిన తరువాతనే కంప్యూటర్ షట్‌డౌన్ అయ్యిందన్న నిర్థారణకు రావాలి. కంప్యూటర్ షట్‌డౌన్ అయి మళ్లి రిస్టార్ట్ అవ్వాలంటే..? కంప్యూటర్ షట్‌డౌన్ అయి మళ్లి రీస్టార్ట్ అవ్వాలంటే క్యాబినెట్ ముందుభాగంలో కనిపించే ‘రిస్టార్ట్' బటన్‌ను నొక్కండి.

Recent Posts