Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ట్విస్ట్: ఎన్టీఆర్ రాజకీయ గురువు చంద్రబాబు!

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు రాజకీయ గురువు ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారట! ఈ విషయాన్ని టిడిపి చెబుతోందంటున్నారు. సినిమాల్లో టాప్ పొజిషన్లో ఉన్న ఎన్టీఆర్ రాజకీయలపై ఆసక్తి చూపించే వారు కాదు. కానీ ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టి నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించారు. అలాంటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కారణం చంద్రబాబట. ఎన్నికలు సమీపిస్తున్నందున టిడిపి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఫేస్‌బుక్‌లో ఓట్ ఫర్ టిడిపి పేరుతో ఒక పేజీని ప్రారంభించారు. దీనిలో టిడిపి హయాంలో సాధించిన అభివృద్ధి, ఇతర పార్టీలపై విమర్శలు, జగన్‌పై అవినీతి ఆరోపణలకు ప్రాధాన్యత ఇచ్చారు. మీకు తెలుసా? అనే శీర్షిక కింద రోజుకో విషయాన్ని వివరిస్తున్నారు. ఈ ఫేస్‌బుక్ పేజీని టిడిపి తరఫున ఆ పార్టీ సాంకేతిక నిపుణులు నిర్వహిస్తున్నారు. మీకు తెలుసా? శీర్షికలో ఎన్టీఆర్‌కు రాజకీయ గురువు చంద్రబాబు అని పేర్కొన్నారు.

        ‘1980లో చంద్రగిరి నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్య క్యాబినెట్‌లో సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు ఒకసారి ఎన్టీఆర్ కుమారులు చంద్రబాబును రామకృష్ణ స్టూడియోకి ఆహ్వానించారు. అలా ఏర్పడిన పరిచయంతో చంద్రబాబు గురించి తెలుసుకొని ఎన్టీఆర్ తన మూడవ కుమార్తె భువనేశ్వరితో పెళ్లి జరిపించారు. అప్పటినుంచే ఎన్టీఆర్ చంద్రబాబును క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకొని సేవా దృక్పథంతో 1982మార్చి 29న టిడిపిని స్థాపించారు' అని అందులో పేర్కొన్నారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్లుగా గుర్తింపు పొందారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మొదలుకొని ఆ తరువాత వచ్చిన అందరు ముఖ్యమంత్రులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, కానీ ఎన్టీఆర్ రాజకీయాల పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపలేదని ఒక సందర్భంలో అక్కినేని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకున్నారు కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించలేదని చెప్పారు. కాగా, చంద్రబాబు 78లో చంద్రగిరి నుంచి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ చీలిన తరువాత హేమాహేమీలంతా రెడ్డి కాంగ్రెస్‌లో ఉండిపోగా, ఇందిరా గాంధీ కొత్తగా ఏర్పాటు చేసిన ఇందిరా కాంగ్రెస్‌లో కొత్త వారికి అవకాశాలు లభించాయి. అలా చంద్రబాబు చంద్రగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 63 మందితో టి అంజయ్య ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బాబుకు స్థానం లభించింది.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)