Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అంజలికి 'బొద్దు' సమస్య.. సీనియర్లతో సూటవుతుంది కానీ...





తెలుగు తెరకు సీనియర్‌ హీరోయిన్లు ఎక్కువైపోయారు. అనుష్క, నయనతార.. ఇలాంటోళ్ళంతా సీనియర్‌ హీరోయిన్ల లిస్ట్‌లోకి వెళ్ళిపోతే, తమన్నా, శృతిహాసన్‌, సమంత, కాజల్‌ తదితరులు మాత్రం యంగ్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. కాజల్‌ కూడా అతి త్వరలో సీనియర్‌ హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరిపోనుంది. అప్పుడిక సీనియర్‌ హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువైపోతుంది. యంగ్‌ జనరేషన్‌ హీరోలకి హీరోయిన్లు కష్టమైపోతారు.

తాజాగా మరో హీరోయిన్‌ సీనియర్‌ హీరోయిన్‌ జాబితాలోకి వెళ్ళిపోయింది. తెలుగు తెరపైకొస్తూనే సీనియర్‌ హీరో వెంకటేష్‌ సరసన నటించిన అంజలి, ఆ తర్వాత రవితేజతో ఓ సినిమాలో నటించింది. మళ్ళీ ఇప్పుడు వెంకటేష్‌తోనే 'మసలా' సినిమాలో నటిస్తోంది.

కాస్త బొద్దుగా వుంటుందనేమో.. సీనియర్‌ హీరోలకైతేనే సూటవుతుంది.. యంగ్‌ హీరోల సరసన అస్సలు సూటవదనే కామెంట్స్‌ ఆమె మీద వస్తున్నాయి. అది నిజం కూడా. సీనియర్‌ హీరోలేమో ఎక్కువ సినిమాలు చేయట్లేదు.. యంగ్‌ హీరోలకి హీరోయిన్ల కరువొచ్చింది.

ఈ టైమ్‌లో అవకాశాల్ని అందిపుచ్చుకోవాలంటే బొద్దుతనం పక్కన పెట్టి, యంగ్‌ లుక్‌ కోసం అంజలి ట్రై చేస్తే బెటర్‌. మిగతావారి సంగతెలావున్నా, అంజలికి అనూహ్యంగా టాలీవుడ్‌లో క్రేజ్‌ ఏర్పడింది. దాన్ని ఆమె క్యాష్‌ చేసుకోవాలంటే డైటింగ్‌ చేయాల్సిందే.

Recent Posts