Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పరిచయమైన ప్రతి స్త్రీతోనూ సెక్స్ కావాలనిపిస్తోంది... ఇదేమైనా జబ్బా...?

కాలేజీ చదివే రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ఆమెతో అతిచనువు కారణంగా ఓ రోజు సెక్సులో పాల్గొన్నాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునే లోపే ఆమె తండ్రి ట్రాన్సఫర్ అయిపోయి వారి కుటుంబం ఢిల్లీ వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమెతో ఎలాంటి సంబంధం లేదు.

ఈమధ్య నాకు పెళ్లయింది. భార్యతో సెక్సులో పాల్గొంటాను. కానీ భార్య తరపు స్త్రీలు వస్తే వారితో సెక్స్ చేయాలనిపిస్తోంది. ఒకరిద్దరితో మాటలు కలిపి వారితో సెక్స్ కోర్కెలు తీర్చుకున్నాను. కానీ ఇంకా కొత్తవారు వచ్చేకొద్దీ వారితోనూ సెక్స్ సుఖం కావాలనిపిస్తోంది. ఇదేదో తెలియని జబ్బులా అనిపిస్తోంది కొన్నిసార్లు ఆలోచిస్తుంటే.

ఇతర స్త్రీలతో సెక్స్ సుఖాన్ని చవిచూస్తున్న సంగతి నా భార్యకు కూడా తెలియదు. నాతో సెక్స్ సుఖం చూసినవారు చెప్పే అవకాశం లేదు. కానీ ఇది మంచిది కాదని తెలిసినా మార్చుకోలేకపోతున్నా. మార్గం ఏమిటి..?

ఇది ఖచ్చితంగా జబ్బే. లైంగిక వాంఛను పలువురితో తీర్చుకోవాలనుకోవడం సెక్స్ ఎడిక్ట్... సెక్స్ పిచ్చి కిందికి వస్తుంది. ఇలాంటి పురుషులు తమకు పరిచయమైన స్త్రీతో అన్ని విషయాల కంటే సెక్స్ కోరిక తీర్చుకునేందుకు గల మార్గాలను అన్వేషిస్తుంటారు. స్త్రీలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు అందుకు అనువైన మార్గాలను చూస్తుంటారు.

పోర్న్ ఫిల్ములు, బూతు పుస్తకాలు వంటివాటిని పరాయి స్త్రీలకు కనబడేట్లు చేయడం, ఇంకా వారిని సెక్స్ కోసం అభ్యర్థించడం వంటి లక్షణాలు ఉంటాయి. పరిచయమైన స్త్రీతో సెక్స్ చేయనిదే ఉండలేరు. ఆమె కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఓ రకమైన మానసిక రుగ్మత. దీనిని అదుపులోకి తెచ్చుకోనట్లయితే సెక్స్ పిచ్చి ముదిరిపోయి ప్రమాదకర స్థితికి వెళ్లిపోతారు. కనుక వెంటనే మానసిక వైద్యులకు సమస్యను చూపించుకుని చికిత్స చేయించుకోవాలి.

Recent Posts