Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పర్మిషన్ తీసుకుని కాపీ కొట్టా... ఏం తప్పా... ఛానల్‌పై రాజమౌళి ఫైర్

ఎస్‌ఎస్‌ రాజమౌళి తను చేసే సినిమాల్లో ఏదో ఒకటి హాలీవుడ్‌ పోకడలు చూపిస్తునే ఉంటాడు. ఎక్కడో ఓచోట ఉన్న సీన్స్‌ను మ్యూజిక్‌ను కాపీ చేస్తుంటాడని సినిమా రిలీజ్‌ తర్వాత తెలిసిపోతుంది. కానీ అది కూడా పెద్దగా అభ్యంతరకరంగానూ ఉండదు. కానీ ఇటీవలే ఆయన చేస్తున్న 'బాహుబలి' విషయం మాత్రం మేకింగ్‌లో ఉండగానే పెద్ద రచ్చ అయింది.

ప్రభాస్‌తో చేస్తున్న ఈ చిత్రం గురించి... ముందుగా మేకింగ్‌ వీడియో అని.. ప్రభాస్‌ పుట్టినరోజునాడు విడుదల చేశారు. దాన్ని ఓ ఛానల్‌ కథనాలుగా చూపించేసేంది. ఇది ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి చెందిన టెంప్లేట్‌ అని.. దాన్ని కాపీ చేశాడని అంది. దీనికి రాజమౌళి స్పందించక తప్పలేదు.

ఛానల్‌వారు... నిజాలు తెలుసుకుని ప్రసారం చేస్తే బాగుండేది. టెంప్లేట్‌ను కాపీ కొట్టడానికి నేనేమీ ప్రోగ్రామ్‌లు కాపీ కొట్టే ఛానల్‌ను కాదు.. టెంప్లేట్‌ను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. వారి పర్మిషన్‌తోనే చేశాం. ఇదంతా లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డాడు.

Recent Posts