Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

విషాదం: హాస్యనటుడు ఎవిఎస్ ఇక లేరు

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు ఎవియస్ ఇక లేరు. ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని మణికొండలో గల తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కాలేయ సమస్యతో బాధపడుతున్న ఎవియస్‌ను సాయంత్రం ఇంటికి తరలించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన కన్ను మూశారు. ఆయన వయస్సు 57 ఏళ్లు. ఆయన మృతి తెలుగు సినీ ప్రపంచం విషాద సముద్రంలో మునిగిపోయింది. ఎవియస్ అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. ఆయన నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలను నిర్మించారు. ఎవియస్ నటుడు మాత్రమే కాకుండా రచయిత కూడా. ఆయన తన జీవితాన్ని పాత్రికేయుడిగా ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి, ఉదయం దినపత్రికల్లో ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. 

        ఆయన 1957 జనవరి 2వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు బాపు మిస్టర్ పెళ్లాం చిత్రం ద్వారా ఆయన హాస్యనటుడిగా పరిచయమయ్యారు. అంతకు ముందు జంధ్యాల ముద్దమందారం సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఎన్టీ రామారావు శ్రీనాథ కవిసార్వభౌమలో కూడా కాసేపు కనిపించారు. మిస్టర్ పెళ్లాం చిత్రంలో నటనకు ఆయన నంది అవార్డును కూడా అందుకున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన సినిమా రంగంలో ఉన్నారు. మాయలోడు, శుభలగ్నం వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఆయన 500కిపైగా చిత్రాల్లో నటించారు. ఆయన మూడు సార్లు మా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన పలు రచనలు కూడా చేశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Recent Posts