Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శింబు : హన్సికతో పనైపోయింది.. ఆండ్రియాను పట్టుకున్నాడు!





హీరోయిన్లతో ప్రేమాయణం నడపడంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రముఖుడు. ఆ మధ్య హన్సికతో మన గురుడు ప్రేమాయణం నడుపుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు హన్సికను కాదని హీరోయిన్ ఆండ్రియా వెంటపడుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నయనతారతో లవ్ డ్యూయెట్లు పాడిన శింబు ఆ తర్వాత ఆమె ప్రేమకు వీడ్కోలు చెప్పి హన్సికతో ప్రేమలో పడ్డాడు. వీరి గురించి రకరకాల ప్రచారం జరగడంతో వన్ ఫైన్‌డే 'మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకుంటాం' అంటూ శింబు, హన్సిక బహిరంగంగా ప్రకటించారు.

వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాతే తమ పెళ్లి ఉంటుందని నటి హన్సిక స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీని వెనుక ఆమె తల్లి ఒత్తిడి ఉందన్నది అసలు విషయం. నటిగా ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనేది హన్సిక తల్లి నిర్ణయం. అందుకు శింబుతో కొద్దిగా దూరంగా ఉండమని హన్సిక తల్లి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లు సమాచారం.

ఇలా జరగడంతో శింబుకు మింగుడు పడడం లేదు. దీంతో వారి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో హాస్యనటుడు వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న 'ఇంగ ఎన్న సొల్లుదు' అనే తమిళ సినిమాలో శింబు అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఈయన సరసన సంచలన నటి ఆండ్రియా నటిస్తోంది.

ఈమె ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుద్‌తో ప్రేమ కలాపాలు సాగించింది. అది నెట్‌లో హల్‌చల్ చేయడంతో ముగిసిపోయిన ప్రేమ కథ అంటూ తేలిగ్గా కొట్టి పారేసింది. తాజాగా శింబుతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఇంగ ఎన్న సొల్లుదు చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు టాక్. ఈ టాక్ నటి హన్సికకు పెద్ద షాక్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

Recent Posts