Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

స్నేహా ఉల్లాల్ ట్విట్టర్ కామెంట్ : మగాళ్ల చేతిలో మోసపోయిందా?

'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమా ద్వారా తెలుగు సినిమాలకు పరిచయమైన అందాల బొమ్మ స్నేహా ఉల్లాల్‌కు ఇప్పుడు అవకాశాలు లేక డీలాపడిపోయింది. ఆమె నటించిన సినిమాలు వరుసగా నిరాశపరచడంతో అనతి కాలంలోనే ఫెయిల్యూర్ హీరోయిన్స్ లిస్ట్‌లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు సినిమాలు కరువయ్యాయి.

అందరి దృష్టి తనపై ఉండేలా స్నేహ ఉల్లాల్ ఇప్పుడు పబ్లిక్‌స్టంట్స్ చేస్తోంది. అందుకు బెడ్‌రూమ్ హాట్ వీడియోలు, హాట్ ఫోటోలను నెట్‌లో అప్‌లోడ్ చేసి జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఆ టెక్నిక్ కూడా పూర్తవడంతో తాజాగా ట్విట్టర్‌లో మగాళ్లపై నోరుపారేసుకుంటోందీ బక్క పల్చని బ్యూటీ.

''ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏకాకిగా ఎందుకు వుంటున్నావు'' అని ఎవరో సన్నిహితులు అడిగిన ప్రశ్నకు ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చిన స్నేహ.. మగాళ్లపై పరోక్షంగా తన కోపాన్ని వెళ్లగక్కింది. పెళ్లి చేసుకోవడానికి మగాళ్లు దొరకక కాదుగానీ పెళ్లయితే కెరీర్ గ్రాఫ్ పడిపోతుందని చెప్పడానికి బదులు ఆమె ఇంకా వేరే పరుషపదజాలం ఉపయోగించింది.

''తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మగాళ్లంతా బాస్టర్డ్స్ అని కాదు గానీ(ఇది అబద్దం) పెళ్లైతే కెరీర్ పక్కదారి పడుతుంది(ఇది నిజం)'' అని ట్వీట్ చేసింది. సాధారణంగా తనకి ఒకవేళ మగాళ్లమీద కోపమే వున్నట్లయితే మామూలుగా మగాళ్లంతా చెడ్డవాళ్లు కాదు అని కూడా చెప్పొచ్చు. కానీ బాస్టర్డ్స్ అని అనాల్సిన అవసరం లేదు.

కానీ ఆమె అలా అంది అంటే అందుకు కారణం మగాళ్లెవరో ఆమెని మోసం చేసి వుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లేదంటే ఆమె హాట్ వీడియోస్‌పై మగాళ్లెవరైనా తీవ్రంగా స్పందించైనా వుండుంటారు. అందుకే ఆమెకి మగాళ్లంటే అంత కోపం అని అనుకుంటున్నారు.

Recent Posts