Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నెలరోజుల్లో పెళ్లి.... వెంటనే బరువు తగ్గే మార్గం ఏదయినా ఉందా...?

యువతుల్లో ఈ సమస్య ఇటీవల ఎక్కువవుతోంది. అమ్మాయిలు తీసుకునే ఆహారంలో పిజ్జాలు, జంక్ ఫుడ్ ఉండటంతో నడుము వద్ద బాగా కొవ్వు పేరుకుపోయి పెళ్లీడు వయసు వచ్చేసరికి లావుగా అయిపోతున్నారు. ఇది పెళ్లికి ప్రతిబంధకంగా మారుతోంది. కనుక జీవనశైలిలో ఓ క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లతో నడుచుకోవాలి. లేదంటే బరువు ఒక్కటే కాదు... ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి.

ఇకపోతే వెనువెంటనే బరువు తగ్గాలనుకోవడం చాలా కష్టమైన విషయమే. అంత త్వరగా బరువు తగ్గాలనుకోవడం కూడా మంచిది కాదు. క్యాలరీలన్నిటినీ ఒకేసారి ఖర్చు చేయాలంటే ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. అందుకు శక్తి అవసరమవుతుంది.

ఐతే నిదానంగా వర్కవుట్లు చేయడం ద్వారా కొంతలో కొంతైనా బరువు తగ్గే వీలుంది. వర్కవుట్లు చేసేటపుడు బ్లాక్ కాఫీ తాగాలి. ఇది శక్తినివ్వడంతోపాటు శరీరంలో నిక్షిప్తమై ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ప్రతి రెండు గంటలకోసారి కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తే బరువును తగ్గించుకోవచ్చు.

Recent Posts