Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివరిదైన 200వ టెస్టు మ్యాచు ఆడుతున్న సందర్భంగా భారత పర్యటనలో ఉన్న కామెరూన్ కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

దేశం కోసం 24ఏళ్లుగా సచిన్ సేవలందిస్తున్నారని కొనియాడాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు తాను తమ దేశ జట్టు ఆటగాళ్లకే మద్దతు పలుకుతానని చెప్పారు.

సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే ఔట్ అవుతాడో అప్పుడు తనకు ఉపశమనంగా ఉంటుందని చెప్పి నాలుక్కరచుకున్నారు. సచిన్ సంతకం చేసిన బ్యాట్ తన వద్ద ఉందని, అది తనకు అమూల్య నిధితో సమానమని కామెరాన్ తెలిపారు.

Recent Posts