Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

చేరువలో, సచిన్‌ను కోహ్లీ బ్రేక్ చేస్తాడు: గవాస్కర్

బెంగళూరు: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఆరో వన్డేలో చెలరేగి ఆడిన విరాట్ కోహ్లీ(115) భారత్‌కు విజయాన్నందించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్.. వేగవంతంగా చేసిన 5వేల పరుగుల రికార్డును అధిగమించేందుకు ఈ యువ ఆటగాడికి మరో 81 పరుగులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే తదుపరి వన్డేలో ఆ పరుగులు కూడా సాధిస్తే రిచర్డ్స్ పేరున ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో నవంబర్ 2న ఆస్ట్రేలియాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే చివరిదైన ఏడో వన్డేపైనే అందరి కళ్లూ ఉన్నాయి. 




బెంగళూరు రాయల్ ఛాలెంచర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ కేవలం 81 పరుగులు చేస్తే వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ పేరున ఉన్న వేగవంతమైన 5వేల పరుగుల రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం విరాట్ 4,919 పరుగులు సాధించాడు. 114 ఇన్నింగ్స్‌ల్లో వివియన్ రిచర్డ్స్ 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా బెంగళూరులో జరిగే మ్యాచులో కోహ్లీ రాణిస్తే ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఆ తర్వాత భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టుతో జరిగే సిరీస్‌లోనైనా కోహ్లీకి ఈ అవకాశం ఉంది. తనకు విద్యుత్ దీపాల కింద బ్యాటింగ్ చేయడమంటే ఇష్టమని కోహ్లీ చెప్పాడు. తన ముందు లక్ష్యం ఉంటే.. అందుకు తగినట్లు ఆడి లక్ష్యాన్ని అవసరమైన సమయంలో పూర్తి చేసేందుకు సులభమవుతుందని మ్యాచ్ అనంతరం కోహ్లీ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో 17 సెంచరీలు సాధించిన కోహ్లీ.. లక్ష్యఛేదనలోనే 11 సెంచరీలు చేయడం గమనార్హం. ఈ సెంచరీలు భారత్‌కు విజయాన్నందించడంలో కీలక భూమికను పోషించాయి. సచిన్ రికార్డులను బ్రేక్ చేసే సత్తా కోహ్లీకే: గవాస్కర్ ఆస్ట్రేలియాతో జరిగిన ఆరో వన్డేలో భారత్‌కు అద్భుత విజయాన్నందించడంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ ఆటగాడు విరాట్ కోహ్లీపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టే సత్తా విరాట్ కోహ్లీకి ఉందని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా విధించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఏడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది
.

Recent Posts